ఇరోం షర్మిల విడుదల.. మళ్లీ దీక్ష | Irom Sharmila to be released as court strikes down charges | Sakshi
Sakshi News home page

ఇరోం షర్మిల విడుదల.. మళ్లీ దీక్ష

Jan 23 2015 2:42 AM | Updated on Sep 2 2017 8:05 PM

ఇరోం షర్మిల విడుదల.. మళ్లీ దీక్ష

ఇరోం షర్మిల విడుదల.. మళ్లీ దీక్ష

సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దుచేయాలన్న డిమాండ్‌తో 14 ఏళ్లుగా ఆమరణ నిరాహార దీక్ష

ఇంఫాల్: సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దుచేయాలన్న డిమాండ్‌తో 14 ఏళ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇరోం  షర్మిలను గురువారం ఇంఫాల్ జ్యుడీషియల్ కోర్టు విడుదల చేసింది. షర్మిలపై మోపిన ఆత్మహత్యాయత్నం అభియోగాలను కోర్టు తిరస్కరించింది. షర్మిల ఆత్మహత్యకు యత్నించారన్న దానిపై ప్రాసిక్యూషన్ ఎలాంటి ఆధారాలను సమర్పించలేకపోయిందని కోర్టు తెలిపింది. గురువారం సాయంత్రం విడుదలైన షర్మిల స్థానిక మార్కెట్‌లోని ఓ షెడ్‌లో తిరిగి నిరాహార దీక్షకు కూర్చున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement