పాకిస్తాన్ను వెనుకేసుకొచ్చిన చైనా! | International community should respect Pak's sovereignty:China | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ను వెనుకేసుకొచ్చిన చైనా!

Jun 10 2016 2:23 PM | Updated on Sep 2 2018 3:19 PM

పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ సమాజం గౌరవించాలని చైనా పేర్కొంది.

బీజింగ్: పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ సమాజం గౌరవించాలని చైనా పేర్కొంది. ఇటీవల పాకిస్తాన్ భూభాగంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో తాలిబాన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ మృతి చెందిన  విషయం తెలిసిందే. తమ భూభాగంలో అమెరికా డ్రోన్ దాడులకు పాల్పడటాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ విషయమై శుక్రవారం చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి హోంగ్ లీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉగ్రవాద నిర్మూలనకు ఎంతగానో కృషి చేస్తున్న పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ప్రపంచదేశాలు గౌరవించాలని పేర్కొన్నారు.

ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, యూఎస్లతో కూడిన క్వాడ్రీలేటరల్ కొ ఆర్డినేషన్ గ్రూప్(క్యూసీజీ).. ఆప్ఘనిస్తాన్ పునరుద్దరణ లక్ష్యంతో పనిచేస్తుందని, ఈ విషయంలో ఉమ్మడి ప్రయత్నాలు జరగాలని ఆయన పేర్కొన్నారు. డ్రోన్ దాడిలో మృతి చెందింది ఓ పాకిస్తాన్ డ్రైవర్గా పేర్కొంన్న హోంగ్ లీ.. అమెరికా డ్రోన్ దాడిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement