చైనాలో మన న్యూస్​ సెన్సార్

Indian websites not accessible in China - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ న్యూస్ వెబ్​సైట్స్, పత్రికలను చైనా సెన్సార్ చేస్తోంది. వర్చువల్​ ప్రైవేట్​ నెట్​వర్క్(వీపీఎన్​)కు కూడా లొంగని అత్యంత శక్తిమంతమైన ఫైర్​ వాల్​ను రక్షణగా నిలిపి, న్యూస్​ సెన్సార్​కు పాల్పడుతోంది. (మీ ఫోన్‌లోని ‘టిక్​టాక్’​ ఏమవుతుంది?)

ప్రస్తుతం చైనాలో ఇండియన్​ టీవీ చానెళ్లను మాత్రమే ఐపీ టీవీ ద్వారా చూడటానికి కుదురుతోందని అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. గత రెండు రోజులుగా ఎక్స్​ప్రెస్​ వీపీఎన్​ ఐఫోన్​, డెస్క్​టాప్​లలో కూడా పని చేయడం లేదని వెల్లడించారు. (అమెజాన్‌కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు)

సెన్సార్​షిప్​కు గురైన వెబ్​సైట్​లోని సమాచారాన్ని రహస్యంగా చూడటానికి వాడే అత్యంత శక్తిమంతమైన టూల్​ వీపీఎన్​. కానీ, రెండ్రోజులుగా చైనాలో ఇది కూడా పని చేయడం లేదు. హాంకాంగ్​ ఉద్రిక్తతల నడుమ ‘హాంకాంగ్ ప్రొటెస్ట్​’అనే పదాన్ని చైనా సెన్సార్ చేసింది. దీంతో ఆ పదంతో రాసిన వార్తలు చైనాలో కనిపించలేదు.

తాజాగా గల్వాన్ లోయ ఉద్రిక్తతల నడుమ భారత వార్తలను సగటు చైనా పౌరుడిని చేరనీయకుండా డ్రాగన్ జాగ్రత్త పడుతోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top