
వాషింగ్టన్: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు నీట మునిగి చనిపోయిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతులను కోయలమూడి అజయ్‌కుమార్ (23), వోలేటి తేజ కౌశిక్ (22)గా గుర్తించినట్లు మీడియా కథనం పేర్కొంది. అర్లింగ్టన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న అజయ్, తేజ యూఎస్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఓక్లహోమాకు వెళ్లారు. మంగళవారం అక్కడి టర్నర్‌ఫాల్స్ అనే జలపాతంలో వారిలో ఓ వ్యక్తి ఈతకు వెళ్లి మునిగిపోగా, అతడ్ని రక్షించడానికి దూకిన మరో వ్యక్తి కూడా నీళ్లలో మునిగిపోయాడు.