ముద్దు పెట్టిన కేసులో ఎన్నారైకి జైలు శిక్ష | INDIAN Man jailed for groping woman on US flight | Sakshi
Sakshi News home page

ముద్దు పెట్టిన కేసులో ఎన్నారైకి జైలు శిక్ష

Oct 25 2014 9:14 AM | Updated on Apr 4 2019 5:12 PM

ముద్దు పెట్టిన కేసులో ఎన్నారైకి జైలు శిక్ష - Sakshi

ముద్దు పెట్టిన కేసులో ఎన్నారైకి జైలు శిక్ష

విమానంలో తనతోపాటు ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎన్నారై దేవేందర్ సింగ్ (62)కి యూఎస్ కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది.

నెవార్క్: విమానంలో తనతోపాటు ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎన్నారై దేవేందర్ సింగ్ (62)కి యూఎస్ కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నెవార్క్లోని జడ్జి స్టాన్లీ చెస్లర్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో దేవేందర్ సింగ్ హ్యూస్టన్ నుంచి నెవార్క్కు యూనైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో పక్కనే కూర్చున్న మహిళకు ముద్దు పెట్టాడు.

అనంతరం ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దాంతో వెంటే నిద్ర నుంచి మొల్కొన్న సదరు మహిళ భయపడిపోయింది. వెంటనే ఆమె విమానంలోని సిబ్బంది వద్దకు వెళ్లి దేవేందర్పై ఫిర్యాదు చేసింది. దాంతో విమానం ఎయిర్పోర్ట్ చేరగానే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో దేవేందర్ సింగ్కు ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఎన్నారై దేవేందర్ సింగ్ ల్యూసియానాలో నివసిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement