breaking news
groping woman
-
మరి నువ్వు ఆమెను టచ్ చెయ్యలేదా?
సాక్షి : హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్(45)కు సోషల్ మీడియాలో ఊహించని పరిణామం ఎదురైంది. నిర్మాత దిగ్గజం హార్వే వెయిన్‌స్టన్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో బెన్ స్పందించగా.. అతనిపైనా సెటైర్లు పడ్డాయి. గతంలో ఓ నటితో అసభ్యంగా ప్రవర్తించిన తీరును గుర్తు చేస్తూ బెన్‌పై ఓ యువతి ట్వీట్ల దాడి చేసింది. సుమారు పదేళ్ల క్రితం బెన్ .. ఎంటీవీ ఛానెల్ టోటల్ రిక్వెస్ట్ లైవ్ కార్యక్రమానికి హాజరయ్యాడు. నటి, ఎంటీవీ మాజీ యాంకర్ హిల్లరీ బర్టన్ తో కలిసి బెన్ ఆ షో నిర్వహించాడు. మైక్‌లో మాట్లాడుతూ ఉండగానే... ఆమె ఎడమ వక్షోజంపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకోకపోయినా... పలు ఇంటర్వ్యూల్లో బర్టన్ ఆ వ్యవహారాన్ని తిరగదోడినట్లయ్యింది. అయినా బెన్ మాత్రం ఆ టాపిక్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఇక హర్వే వెయిస్టన్ వ్యవహారాన్ని ఖండిస్తూ బెన్ తన ట్విట్టర్లో ఓ ట్వీట్ వేశాడు. దీనికి స్పందించిన ఓ యువతి ‘మరి గతంలో నువ్వు చేసిందేంటి? మరిచిపోయావా? అంటూ ప్రశ్నించగా.. బెన్ తానేం మరిచిపోలేదంటూ సమాధానమిచ్చాడు. పైగా తాను తప్పు చేసినట్లు అంగీకరిస్తూ.. పదేళ్ల తర్వాత నటి హిలెరి బర్టన్‌కు క్షమాపణలు తెలియజేస్తున్నట్లు ఓ ట్వీట్ చేశాడు. ఇక ఆ యువతి చేసిన ట్వీట్ పై నటి హిలెరి కూడా స్పందించింది. తన తరపున ప్రశ్నించిన యువతిని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అప్పటి వీడియోను కొందరు వైరల్ చేస్తున్నారు కూడా. 1997లో వచ్చిన బెన్-హర్వే వెయిన్‌స్టన్ కాంబోలో వచ్చిన గుడ్ విల్ హంటింగ్ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అప్పటి నుంచి వీరద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే తాజాగా ది న్యూయార్క్ టైమ్స్ మరియు ది న్యూయార్కర్ సంచికలు హర్వే లైంగిక వేధింపుల పర్వంపై సాక్ష్యాలతో సహా వివరంగా కథనాలు రాయటంతో.. అంతా సోషల్ మీడియాలో హర్వేను దుయ్యబడుతున్నారు. I acted inappropriately toward Ms. Burton and I sincerely apologize — Ben Affleck (@BenAffleck) October 11, 2017 -
ముద్దు పెట్టిన కేసులో ఎన్నారైకి జైలు శిక్ష
నెవార్క్: విమానంలో తనతోపాటు ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎన్నారై దేవేందర్ సింగ్ (62)కి యూఎస్ కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నెవార్క్‌లోని జడ్జి స్టాన్లీ చెస్లర్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేవేందర్ సింగ్ హ్యూస్టన్ నుంచి నెవార్క్‌కు యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో పక్కనే కూర్చున్న మహిళకు ముద్దు పెట్టాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దాంతో వెంటే నిద్ర నుంచి మొల్కొన్న సదరు మహిళ భయపడిపోయింది. వెంటనే ఆమె విమానంలోని సిబ్బంది వద్దకు వెళ్లి దేవేందర్‌పై ఫిర్యాదు చేసింది. దాంతో విమానం ఎయిర్పోర్ట్ చేరగానే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో దేవేందర్ సింగ్‌కు ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఎన్నారై దేవేందర్ సింగ్ ల్యూసియానాలో నివసిస్తున్నాడు.