అంతర్జాతీయంగా కీలకమైన క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్)లోకి భారత్ ప్రవేశించనుంది.
వాషింగ్టన్: అంతర్జాతీయంగా కీలకమైన క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్)లోకి భారత్ ప్రవేశించనుంది. ప్రధాని మోదీ తాజా అమెరికా పర్యటనలో ఇది సాకారమయ్యే అవకాశముంది. అదే జరిగితే, లక్షిత ప్రాంతాలను కచ్చితత్వంతో ధ్వంసం చేయగల ప్రిడేటర్ డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుక్కోగలుగుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన తన క్షిపణులను మిత్రదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు.
బాలిస్టిక్ క్షిపణుల వ్యాప్తికి వ్యతిరేకంగా రూపొందిన ‘ది హేగ్ కోడ్ ఆఫ్ కండక్ట్’ను అనుసరిస్తామంటూ భారత్ ప్రకటించాక ఎంటీసీఆర్‌లోకి భారత్ ప్రవేశానికి మార్గం సుగమమైంది. ఎంటీసీఆర్‌లో సభ్యత్వ విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్‌కు గట్టి మద్దతుదారు కాగా, కొన్ని సభ్యదేశాలు వ్యతిరేకిస్తున్నాయి.