కెన్యాకు ప్రధాని మోదీ కానుక | India gifts 30 field ambulances to Kenya | Sakshi
Sakshi News home page

కెన్యాకు ప్రధాని మోదీ కానుక

Jul 11 2016 7:44 PM | Updated on Aug 24 2018 2:20 PM

కెన్యాకు ప్రధాని మోదీ కానుక - Sakshi

కెన్యాకు ప్రధాని మోదీ కానుక

కెన్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ 30 అంబులెన్స్లను ఆ దేశానికి కానుకగా ఇచ్చారు.

న్యూఢిల్లీ: కెన్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ 30 అంబులెన్స్లను ఆ దేశానికి కానుకగా ఇచ్చారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ కెన్యా అధ్యక్షుడు ఉతురు కెన్యట్టకు అంబులెన్స్ తాళం చెవులను అప్పగించారు.

భారత్-కెన్యా రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని భారత విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. భారత్కు చెందిన అశోక్ లేలాండ్ తయారు చేసిన ఈ అంబులెన్స్లను కెన్యా రక్షణ బలగాలు ఉపయోగిస్తాయి. మోదీ, కెన్యట్ట నాయకత్వంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అనంతరం నైరోబి యూనివర్శిటీలో మోదీ గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు.  వర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement