ఆశ్చర్యంలో ముంచెత్తిన అతిథి! | Incredible moment buffalo turns landlord at South African game reserve | Sakshi
Sakshi News home page

ఆశ్చర్యంలో ముంచెత్తిన అతిథి!

Mar 9 2016 6:24 PM | Updated on Sep 3 2017 7:21 PM

ఆశ్చర్యంలో ముంచెత్తిన అతిథి!

ఆశ్చర్యంలో ముంచెత్తిన అతిథి!

బారులో తీరిగ్గా మందు తాగుతున్న సమయంలో ఊహించని విధంగా అనుకోని అతిథి ఊడిపడడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

కేప్ టౌన్: బారులో తీరిగ్గా మందు తాగుతున్న సమయంలో ఊహించని విధంగా అనుకోని అతిథి ఊడిపడడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. మందు గ్లాసులు వదిలిపెట్టి అదేం చేస్తోందని ఆసక్తిగా గమనించడం మొదలు పెట్టారు. దక్షిణాఫ్రికా తూర్పు కేప్ లో పీటర్సన్ ప్రాంతానికి సమీపంలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

హ్లోసీ గేమ్ లాడ్జీలోని బారులోకి ఓ అడవి దున్నపోతు ప్రవేశించింది. తీరిగ్గా నడుచుకుంటూ వచ్చి బార్ మధ్యలో ఠీవిగా నిలుచుంది. కొద్దిసేపు చుట్టూ పరిసరాలను పరిశీలించింది. అంతకుముందే లాడ్జి ప్రాంగంణంలోని అడుగుపెట్టిన ఈ అడవి జంతువు స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు తాగింది. తర్వాత సన్నని దారి గుండా బార్ లోకి ప్రవేశించింది.

అయితే దాని వల్ల ఎటువంటి నష్టం వాటిల్లలేదని బార్ సిబ్బంది తెలిపారు. అది ఏ వస్తువును ముట్టుకోలేదని వెల్లడించారు. బార్ లోకి వచ్చిన దున్నపోతును జాగ్రత్తగా బయటకు పంపించేశారు. బార్ మధ్యలో నిలుచున్న దున్నపోతు ఫొటోను లాడ్జి సిబ్బంది క్యాప్షన్ తో ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement