పడక మంచం @ రూ. 26 కోట్లు | in the bed. 26 crore | Sakshi
Sakshi News home page

పడక మంచం @ రూ. 26 కోట్లు

Jul 3 2014 12:45 AM | Updated on Sep 2 2017 9:42 AM

పడక మంచం @ రూ. 26 కోట్లు

పడక మంచం @ రూ. 26 కోట్లు

మీరు వాడే బెడ్ ఖరీదెంత? రూ. 20 వేలో.. 30 వేలో.. మహా అయితే లక్ష రూపాయల దాకా ఉంటుంది. అదే ఎవరైనా ప్రముఖ వ్యక్తులు వాడినదైతే..!?

మీరు వాడే బెడ్ ఖరీదెంత? రూ. 20 వేలో.. 30 వేలో.. మహా అయితే లక్ష రూపాయల దాకా ఉంటుంది. అదే ఎవరైనా ప్రముఖ వ్యక్తులు వాడినదైతే..!? అభిమానులు ఎంతైనా పెట్టి కొనేస్తారు మరి! బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత చిత్రకారిణి ట్రేసీ ఎమిన్ ఉపయోగించిన బెడ్.. ఏకంగా రూ. 26 కోట్లు పలికింది.

ఈ బెడ్‌తోపాటు ఎమిన్ ఉపయోగించిన మరకలు పడిన దుప్పట్లు, ఖాళీ వోడ్కా సీసాలు, సిగరెట్ పీకలు, వాడేసిన కండోమ్‌లు కూడా ఉన్న ఈ సెట్ మొత్తాన్నీ క్రిస్టీస్ సంస్థ  వేలం వేయగా.. లండన్‌కు చెందిన ఓ వ్యక్తి దానిని కొనుక్కున్నాడు. మరో విషయం ఏమిటంటే.. ఈ వేలానికి ట్రేసీ ఎమిన్ కూడా హాజరై, దీనిని కొనుక్కున్న వ్యక్తిని అభినందించారు కూడా.
 

Advertisement
 
Advertisement
Advertisement