'నేను కళ్లు మూసుకుంటే మొద్దు నిద్రే' | I sleep like a log: Pope Francis | Sakshi
Sakshi News home page

'నేను కళ్లు మూసుకుంటే మొద్దు నిద్రే'

Sep 15 2015 11:18 AM | Updated on Sep 3 2017 9:27 AM

'నేను కళ్లు మూసుకుంటే మొద్దు నిద్రే'

'నేను కళ్లు మూసుకుంటే మొద్దు నిద్రే'

తాను మొద్దులా నిద్రపోతానని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు. ఆయన పోర్చుగీస్కు చెందిన రేడియో చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన వ్యక్తిగత విషయాలు చెప్పారు

వాటికన్ సిటీ: తాను మొద్దులా నిద్రపోతానని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు. ఆయన పోర్చుగీస్కు చెందిన రేడియో చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన వ్యక్తిగత విషయాలు చెప్పారు. తనకు నిద్రలేమి సమస్య లేదని అన్నారు. 'నేను ఈ సందర్భంగా మీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. నాకు నిద్రలేమి సమస్య లేదు.

నేను మొద్దులా నిద్రపోతాను' అని అన్నారు. మరి మీరు తొందరగా నిద్రలేవాలంటే ఎలా అని మరో ప్రశ్న వేయగా.. తనకు చాలా పని ఉందని భావిస్తే మాత్రం వెంటనే మేల్కొంటానని చెప్పారు. దేవుడు ఆదేశించినప్పుడు మాత్రం అది ఏ ప్రాంతంలోనైనా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయేందుకు సంతోషపడతానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement