భారతీయులంటే ఇష్టం.. చైనీయులు కూడా: ట్రంప్‌

I Love India People and China People Said Trump - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత, చైనాల మధ్య శాంతిని నెలకొల్పడానికి సాధ్యమైనంత చేయాలనుకుంటున్నట్లు ఆయన ప్రతినిధి ఒకరు తెలిపారు. గత కొన్ని రోజులుగా చైనాకు భారత్‌కు మధ్య సరిహద్దు ముదురుతున్న నేపథ్యంలో అమెరికా భారత్‌కు మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్‌ భారతదేశానికి అనుకూలంగా స్పందించిన  విషయంపై  వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీమెక్నానీని ప్రశ్నించగా ‘నేను భారత ప్రజలను ప్రేమిస్తున్నాను అదేవిధంగా నేను చైనా ప్రజలను కూడా ప్రేమిస్తున్నాను. ఇరు దేశాల ప్రజలకు శాంతిని కలిగించడానికి నేను చేయగలిగినదంతా చేయాలనుకుంటున్నాను’ అని ట్రంప్‌ చెప్పినట్లు ఆమె తెలిపారు. 

అదేవిధంగా వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో భారతదేశాన్ని గొప్ప మిత్రదేశంగా అభివర్ణించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రధాని నరేంద్ర మోదీకి గొప్ప స్నేహితుడు అని ఆయన తెలిపారు. దీంతోపాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో మాట్లాడుతూ, భారతదేశం అమెరికాకు గొప్ప భాగస్వామిగా ఉందని పేర్కొన్నారు. "భారతదేశం అమెరికాకు ముఖ్యమైన భాగస్వామి. భారత విదేశాంగ మంత్రి తో నాకు మంచి సంబంధం ఉంది. మేం అనేక సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. చైనాతో  ఉన్న సరిహద్దు వివాదం గురించి మేం మాట్లాడుకున్నాం’ అని తెలిపారు.

ఇంకా వైట్‌హౌస్‌ ప్రతినిధి ఏఐ మాసన్‌ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఏ అమెరికా ప్రెసిడెంట్‌ కూడా ఇండియాకు మద్దతుగా నిలుస్తామని బహిరంగంగా చెప్పలేదని, అలా చెప్పిన మొదటి అధ్యక్షుడు ట్రంప్‌ అని తెలిపారు. నాకు భారత్‌ అంటే ఇష్టం, మేం భారత్‌ను గౌరవిస్తాం. అమెరికా భారత్‌కు అండగా ఉంటుంది అని నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో ట్రంప్‌ చెప్పారని మాసన్‌ గుర్తు చేశారు.

చదవండి:  ‘అమెరికా జోక్యం అనవసరం’

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top