లిబియాలోని జ్వారాలో సముద్రతీరానికి సుమారు 104 మంది శరణార్థుల మృతదేహాలు కొట్టుకువచ్చాయి.
బీచ్‌కు కొట్టుకొచ్చిన 104 మృతదేహాలు
Jun 3 2016 10:38 PM | Updated on Sep 4 2017 1:35 AM
ట్రిపోలీ: లిబియాలోని జ్వారాలో సముద్రతీరానికి సుమారు 104 మంది శరణార్థుల మృతదేహాలు కొట్టుకువచ్చాయి. గురువారం సాయంత్రం తీర ప్రాంతానికి చాలా మృతదేహాలు కొట్టుకువచ్చాయని .. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నావికాదళ అధికారులు శుక్రవారం తెలిపారు. ఇతర దేశాలకు వెళ్తోన్న 700 మంది శరణార్థులు ప్రయాణిస్తున్న బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు దాదాపు 340 మంది కాపాడామని గ్రీక్ కోస్ట్ గార్డ్ అధికార ప్రతినిధి నికోస్ లగాడియానోస్ తెలిపారు. మిగతా శరణార్థులు మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
Advertisement
Advertisement