కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌కు 550 కిలోమీటర్ల ఉత్తరదిశలోని ఫ్లిండర్స్ పర్వతాల్లో ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో.. అక్కడ ఇంతకుముందు ఊహించినదానికన్నా 10 వేల సంవత్సరాల ముందే మానవుల ఉనికి ఉందని గుర్తించారు. ఆదిమ మానవులకు సంబంధించిన వందలాది రాళ్లతో తయారుచేసిన కళాఖండాలు, ఎముకలకు సంబంధించిన ఆనవాళ్లు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇంతకుముందు ఆస్ట్రేలియా తూర్పుతీరంలోని న్యూ సౌత్‌వేల్స్‌కు 50,000 సంవత్సరాల క్రితం మానవులు చేరుకున్నారని, వారు అక్కడనుంచి మధ్య ఆస్ట్రేలియా ప్రాంతానికి చేరుకోవడానికి 11,000 సంవత్సరాలు పట్టిందని పరిశోధకులు భావించేవారు. అయితే.. తాజాగా దొరికిన పురాతన అవశేషాలు.. మధ్య ఆస్ట్రేలియాలో ముందుగానే మానవుడి ఉనికిని తెలుపుతున్నాయని పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు.
Breadcrumb
ఊహించిన దానికన్నా 10వేల ఏళ్ల ముందుగానే!
Published Thu, Nov 3 2016 9:43 AM
# Tag
Related news
-
ప్రేయసిని నిశ్చితార్థం చేసుకున్న ఆసీస్ మహిళా స్టార్ క్రికెటర్..
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్ తన చిరకాల స్నేహితురాలు మోనికా రైట్ను నిశ్చితార్థం చేసుకుంది. గత మూడేళ్లగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. తమ బంధంలో మరో అడుగు ముందుకు వేసింది. శుక్రవారం కొంతమంది సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఉంగరాలు మార్చకున్నారు. తమ నిశ్చితార్థ ఫొటోలను గార్డ్నర్ సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు కాబోయే కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా గార్డ్నర్, మోనికాలు 2021 నుంచి ప్రేమలో ఉన్నారు. గార్డ్నర్ను సపోర్ట్ చేసేందుకు మోనికా చాలా సందర్బాల్లో స్టేడియం వచ్చేది. 2017లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గార్డనర్ .. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలుగా కొనసాగుతోంది. గార్డనర్ తన కెరీర్లో ఇప్పటివరకు ఆరు టెస్టులు, 69 వన్డేలు, 88 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 2583 పరుగులతో పాటు 180 వికెట్లు పడగొట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు గార్డనర్ ప్రాతినిథ్యం వహిస్తోంది. View this post on Instagram A post shared by Ashleigh Gardner (@ashleigh_gardner97) -
బెయిల్ నిరాకరణ.. కోర్టులో కూప్పకూలిన ఆసీస్ మాజీ ఓపెనర్
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ ఓపెనర్ మైఖేల్ స్లేటర్ వివాదంలో చిక్కుకున్నాడు. భార్యపై గృహ హింసకు పాల్పడడం, మహిళల్ని వెంబడించడం, దొంగతనానికి పాల్పడడం వంటి కేసుల్లో భాగంగా స్లేటర్‌ను క్వీన్స్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఏకంగా 19 కేసులు నమోదయ్యాయి. 2023 డిసెంబర్ 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ మధ్యలో అతను ఈ నేరాలకు పాల్పడినట్లు కేసులు రిజిష్టర్ అయ్యాయి. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మైఖేల్ స్లేటర్‌కు క్వీన్స్లాండ్ మేజిస్ట్రేట్ కోర్టు షాకిచ్చింది. అతడి బెయిల్ ధరఖాస్తును కోర్టు తిరస్కరించింది. అతడికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసుపై తదుపరి విచారణను మే 31కు కోర్టు వాయిదా వేసింది. ఈ విషయం తెలిసిన స్లేటర్ కోర్టు ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బంది అతడిని తన సెల్‌కు తీసుకు వెళ్తుండగా స్లేటర్ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ మీడియా తమ కథనాల్లో పేర్కొంది. అదేవిధంగా స్లేటర్ ప్రస్తుతం మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా గతంలో పలుమార్లు కోర్టు ఆదేశాలను స్లేటర్ ధిక్కరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియా తరపున 74 టెస్టులు, 42 వన్డేలు ఆడిన స్లేటర్ 42.83 సగటుతో 5,312 పరుగులు సాధించాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్లేటర్ ఆ తర్వాత టీవీ కామెంటేటర్‌గా రాణించాడు. ఛానెల్ 9, ఛానల్ 7లలో పనిచేశారు. -
పాట్ కమిన్స్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు (ఆస్ట్రేలియా) ప్రతిష్టాత్మక విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను విజ్డెన్ ఈ అవార్డుకు పాట్‌ను ఎంపిక చేసింది. గతేడాది వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా సాధించిన ఘనతలకు గాను పాట్‌ను ఈ అవార్డు వరించింది. కమిన్స్ 2023లో కెప్టెన్‌గా వన్డే వరల్డ్‌కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, యాషెస్ సిరీస్‌లను గెలిచాడు. గతేడాది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సైతం దక్కించుకున్న కమిన్స్.. వ్యక్తిగత ప్రదర్శనల కారణంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్, ఇంగ్లండ్‌తో బాక్సింగ్ డే టెస్ట్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తదితర అవార్డులు అందుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని కూడా విజయవంతంగా ముందుండి నడిపిస్తున్న కమిన్స్.. ఈ సీజన్ వేలంలో 20.5 కోట్ల రికార్డు ధర దక్కించుకున్నాడు. విజ్డెన్.. కమిన్స్‌తో పాటు ఉస్మాన్ ఖ్వాజా, మిచెల్ స్టార్క్, ఆష్లే గార్డ్నర్ (ఆసీస్ మహిళా క్రికెటర్), హ్యారీ బ్రూక్, మార్క్ వుడ్ లాంటి అత్యుత్తమ ప్రతిభావంతులను కూడా సత్కరించింది. 2015 నుంచి విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నవారు.. 2015లో కేన్ విలియమ్సన్ 2016లో విరాట్ కోహ్లి 2017లో విరాట్ కోహ్లి 2018లో విరాట్ కోహ్లి 2019లో బెన్ స్టోక్స్ 2020లో బెన్ స్టోక్స్ 2021లో జో రూట్ 2022లో బెన్ స్టోక్స్ 2023లో పాట్ కమిన్స్ -
Sagubadi: విపత్తులకు తట్టుకునే ప్రకృతి సేద్యం.. గొప్పేంటి?
2023 డిసెంబర్ 4,5 తేదీల్లో విరుచుకుపడిన మిచాంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో పంటలను, ముఖ్యంగా వరి పంటను, నేలమట్టం చేసింది. అయితే, ఆ తీవ్రమైన గాలులు, వర్షాన్ని తట్టుకొని నిలబడే ఉన్నాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి పొలాలు. రసాయనిక వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి చేలు నేలకు వాలిపోయి, నీట మునిగి ఉంటే.. వీటి పక్కన పొలాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ వరి పంట మాత్రం చెక్కుచెదరకుండా దర్జాగా నిలబడి ఉండటం గురించి అప్పట్లోనే వార్తా కథనాలు చదివిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మిచాంగ్ తుపానే కాదు అంతకుముందు కూడా అనేక విపత్కర పరిస్థితుల్లోనూ ఇది స్పష్టంగా కళ్లకు కట్టిన వాస్తవం. అయితే, ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైన ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు డాక్టర్ ఫిల్ లీ ఈ నెల మొదటి వారంలో ఏపీలో పర్యటించారు. అనంతపురం తదితర జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు తుపానును, కరువును దీటుగా తట్టుకొని నిలబడుతూ సుభిక్షంగా, ఉత్పాదకంగా నిలవటానికి వెనుక గల శాస్త్రీయ కారణాలను డా. ఫిల్ లీ అన్వేషించారు. అనేక కోస్తా జిల్లాల్లో మిచాంగ్ తుపానుకు నేలకొరిగిన రసాయనిక వరి పొలాల్లో గడ్డికి, పక్కనే పడిపోకుండా నిలబడిన వరి పొలాల్లో గడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసాలేమిటో తన వెంట తెచ్చిన అధునాతన మైక్రోస్కోప్ ద్వారా పరిశోధించారాయన. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన వరి మొక్క కాండంలో కణ నిర్మాణం రసాయనిక వ్యవసాయంలో కన్నా బలంగా, ఈనెలు తేలి ఉండటాన్ని ఆయన గుర్తించారు. రసాయనాలతో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు నేలకొరిగింది (ఎడమ ఫైల్), ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు తట్టుకుంది (కుడి ఫైల్) "మిచాంగ్ తుపాను నాటి రసాయనిక, ప్రకృతి సేద్య వరి పంటలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డా. ఫిల్ లీ అధ్యయనం" "ప్రకృతి సేద్యంతో ఒనగూడుతున్న అద్భుత ఫలితాలను కళ్లకు కట్టిన అధ్యయన ఫలితాలు" "ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత పెరుగుతుంది. అందువల్లనే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ఈ పంటలకు వస్తోందనడానికి ఇప్పుడు విస్పష్టమైన రుజువులు దొరికాయి". – డాక్టర్ ఫిల్ లీ, ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు, ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి మొక్కలు చాలా బలంగా ఉన్నాయి. ఇది ప్రకృతి సేద్య బలానికి నిదర్శనం’ అన్నారు డా. ఫిల్ లీ. అదేవిధంగా, ఏప్రిల్ మొదటి వారంలో అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన రసాయనిక, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగవుతున్న పంటలను పరిశీలించారు. ఆయా పొలాల్లో మట్టి నమూనాలను కూడా సేకరించి అధ్యయనం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి కాండం (మైక్రోస్కోప్ ఎడమ చిత్రం), రసాయనాలతో పండించిన వరి కాండం (కుడి చిత్రం) బంతి పూలను ఏకపంటగా సాగు చేస్తున్న రసాయనిక పొలంలోని మట్టిలో జీవం తక్కువగా ఉందని గుర్తించారు. ఆ పొలం పక్కనే బంతితో పాటు 12 పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పొలంలోని మట్టి నమూనాలను పరిశోధించగా.. మట్టి కణాల నిర్మాణం, ఆ మట్టిలో వైవిధ్యపూరితమైన సూక్ష్మజీవరాశి ఎంతో సుసంపన్నంగా ఉన్నట్లు గుర్తించానని డా. ఫిల్ లీ వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో పెరుగుతున్న జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత వల్లనే పంటలకు వైపరీత్యాలను తట్టుకునే శక్తి వస్తోందనడానికి విస్పష్టమైన రుజువులు దొరికాయని ఆయన తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వీడియోలు ‘ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిటీ నాచురల్ ఫార్మింగ్’ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. తిరుపతిలో 20,21 తేదీల్లో ఆర్గానిక్ మేళా.. తిరుపతి టౌన్ క్లబ్ కూడలిలోని మహతి ఆడిటోరియంలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఉ. 10.30 గం. నుంచి రాత్రి 8 గం. వరకు స్వచ్ఛంద సంస్థ ‘కనెక్ట్ 2 ఫార్మర్’ ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తులు ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. రైతులు నేరుగా తమ ఆర్గానిక్ పంట ఉత్పత్తులను వినియోగదారులకు అమ్ముకోగలిగే ఏర్పాటు చేయటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని కనెక్ట్ 2 ఫార్మర్ వ్యవస్థాపకులు శిల్ప తెలిపారు. 20న కషాయాల తయారీపై గంగిరెడ్డి, దేశవాళీ పండ్లు / పూల మొక్కల గ్రాఫ్టింగ్‌పై జె.ఎస్. రెడ్డి శిక్షణ ఇస్తారు. కంపోస్టింగ్‌పై డా.సింధు అవగాహన కల్పిస్తారు. 21న 5 దొంతర్ల పండ్లు, కూరగాయల సాగుపై, ఇంకుడుగుంతల నిర్మాణంపై విజయరామ్ ప్రసంగిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రకృతివనం ప్రసాద్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 63036 06326. ఇవి చదవండి: Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు! -
మేజర్ లీగ్ క్రికెట్లో సన్‌రైజర్స్ స్టార్ ప్లేయర్
అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్ బరిలో మరో ఆస్ట్రేలియా ఆటగాడు నిలిచాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ట్రవిస్ హెడ్ వాషింగ్టన్ ఫ్రీడం ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీకి ఇదివరకే చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆసీస్ లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ మోసస్ హెన్రిక్స్ ఈ జట్టుకు సారధ్యం వహిస్తుండగా.. స్టీవ్ స్మిత్, తన్వీర్ సంగా, బెన్ డ్వార్షుయిస్, జోష్ ఫిలిప్ లాంటి ఆసీస్ ప్లేయర్స్ ఆటగాళ్లుగా బరిలోకి దిగనున్నారు. వాషింగ్టన్ ఫ్రీడంతో ఇటీవలే ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు. పాంటింగ్ ఎంఎల్సీ తదుపరి సీజన్ నుంచి ఈ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ ఆసీస్ ఆటగాళ్లంతా కలిసి జులై 4 నుంచి ప్రారంభంకాబోయే ఎంఎల్సీ సెకెండ్ ఎడిషన్‌లో వాషింగ్టన్ ఫ్రీడంకు ప్రాతినిథ్యం వహిస్తారు. వీరితో పాటు మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు ఎంఎల్‌సీలో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడనున్నారు. ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్‌కు.. టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. మేజర్ లీగ్ టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ప్రారంభమవుతుంది. ఈ లీగ్‌లో ఆసీస్ ఆటగాళ్లే కాక చాలామంది విదేశీ ఆటగాళ్లు పాల్గొననున్నారు. న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర కూడా కొత్తగా వాషింగ్టన్ ఫ్రీడంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. సౌతాఫ్రికా మార్కో జన్సెన్, వెస్టిండీస్ అకీల్ హొసేన్‌ను వాషింగ్టన్ ఫ్రీడం తిరిగి రీటైన్ చేస్తున్నట్లు సమాచారం. ఆటగాళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం త్వరలో వెల్లడికానుంది.
Related News by category
-
రుణం కోసం ఐఎంఎఫ్‌ను సంప్రదించిన పాక్!
పొరుగు దేశం పాకిస్తాన్ రుణ సాయం కోసం మరోమారు చేయి చాచింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తమ దేశానికి కొత్త రుణం కోసం అభ్యర్థించారు.పాక్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) సమావేశంలో పాక్‌కు మూడు బిలియన్ యూఎస్ డాలర్లు ఎస్బీఏ కింద అందించేందుకు ఐఎంఎఫ్ మద్దతు ఇచ్చినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివరాలను పీటీవీ న్యూస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలిపింది. కాగా స్టాండ్‌బై అరేంజ్మెంట్ (ఎస్బీఏ) కింద 1.1 బిలియన్ డాలర్ల రుణంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సోమవారం సమావేశం కానుంది.గత ఏడాది జూన్‌లో జరిగిన ఐఎంఎఫ్ కార్యక్రమంలో పాకిస్తాన్ మూడు బిలియన్ డాలర్ల రుణం అందుకుంది. తాజాగా జరిగిన డబ్ల్యుఈఎఫ్ ప్రత్యేక సమావేశంలో పాక్ ప్రధాని షరీఫ్ ‘ప్రపంచ ఆరోగ్య అజెండాను పునర్నిర్వచించడం’పై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ అసమానతలను ప్రస్తావించారు. 2003లో సౌదీ అరేబియా వెళ్లినప్పుడు తనకు క్యాన్సర్ సోకిందని షరీఫ్ తెలిపారు. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళ్లి వేల డాలర్లు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇంతటి ఖరీదైన చికిత్సను తమ దేశంలోని ప్రజలు భరించలేరని తెలిపారు.తాను పాకిస్తాన్‌కు తిరిగి వచ్చినప్పుడు, పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని, తమ ప్రభుత్వం కిడ్నీ, కాలేయ వ్యాధులతో పాటు క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించిందని షాబాజ్ చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచంలోని ఆరోగ్య అసమానతలను, లోపాలను బహిర్గతం చేసిందని షరీఫ్ పేర్కొన్నారు. -
దుబాయ్‌లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
దుబాయ్‌లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దుబాయ్‌లో నిర్మించబోతున్నారు. ఈ మేరకు దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటన చేశారు. దీని కోసం 35 బిలియన్ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారు.వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం నిర్మించచోతున్నారు. ఈ విషయాన్ని దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ ఆదివారం ప్రకటించారు. ఈ విమానాశ్రయం పేరును అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఈ విమానాశ్రయాం నిర్మించడానికి 35 బిలియన్ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారు. ఏడాదికి 260 మిలియన్ల మంది రాకపోకలు కొనసాగించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.ఒక్క ఏడాదిలో దాదాపు 260 మిలియన్ల మంది ప్రయాణీకులు ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణాలు కొనసాగించవచ్చన్నారు. ఈ విమానాశ్రయంలో ఐదు సమాంతర రన్వేలు, 400 ఎయిర్‌క్రాఫ్ట్ గేట్స్ దీని ప్రత్యేకతలుగా చెప్పారు. కాగా, అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. రాబోయే సంవత్సరాల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు నుండి అన్ని కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. Today, we approved the designs for the new passenger terminals at Al Maktoum International Airport, and commencing construction of the building at a cost of AED 128 billion as part of Dubai Aviation Corporation's strategy.Al Maktoum International Airport will enjoy the… pic.twitter.com/oG973DGRYX— HH Sheikh Mohammed (@HHShkMohd) April 28, 2024 ఇక, ఈ ఎయిర్‌పోర్టు ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమిరేట్స్, లోబడ్జెట్ విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్‌తో పాటు ప్రపంచాన్ని దుబాయ్‌కి, బయటికి కనెక్ట్ చేసే అన్ని ఎయిర్‌లైన్ భాగస్వాములకు కొత్త డెస్టినేషన్ కానుందని దుబాయ్ ప్రభుత్వ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్-మక్తూమ్ వెల్లడించారు. ఈ నిర్మాణం ప్రపంచ వేదికపై ప్రముఖ ఏవియేషన్ హబ్‌గా దుబాయ్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు. -
బర్డ్‌ఫ్లూ భయం లేదు.. అలా చేసిన పాలు సేఫ్!
జంతువుల్లో ప్రాణాంతకమైన బర్డ్‌ఫ్లూ వైరస్ అమెరికాలో మనిషికి సోకడం భయాందోళన కలిగిస్తోంది. వైరస్ ఆనవాళ్లు మనుషులు తాగే ఆవు పాలలో కనిపించడంతో అందరూ భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు కీలక విషయం చెప్పారు.యూఎస్ స్టోర్లలో విక్రయిస్తున్న పాలు బర్డ్ ఫ్లూ నుండి సురక్షితమైనవని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఎందుకంటే ఈ పాలను పాశ్చరైజేషన్ చేస్తారని, పాశ్చరైజేషన్ వ్యాధిని ప్రభావవంతంగా చంపుతుందని పేర్కొన్నారు.అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుయంజా (HPAI) వ్యాప్తి దేశవ్యాప్తంగా పాడి పశువుల మందల ద్వారా వ్యాపించింది. తేలికపాటి లక్షణాలతో ఒక వ్యక్తికి సోకింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని పాల విక్రయ సంస్థల నుంచి నమూనాలను ఎఫ్‌డీఏ పరీక్షించింది. ఇందులో ప్రతి ఐదు శాంపిల్స్‌లో ఒక దాంట్లో వైరస్ ఆనవాళ్లు కనిపించాయని ఎఫ్‌డీఏ పేర్కొంది.అయితే పాశ్చరైజేషన్ ప్రక్రియ కారణంగా వైరస్ పాల ద్వారా ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం లేదని ఎఫ్‌డీఏ ప్రకటించింది. దీనిపై మరిన్ని పరీక్షలు అవసరమని పేర్కొంది. హెచ్‌పీఏఐని నిష్క్రియం చేయడంలో పాశ్చరైజేషన్ ప్రభావవంతంగా ఉంటుందిని ప్రాథమిక ఫలితాల్లో గుర్తించినట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది. ఇంతకుముందు బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు పచ్చి పాలలో కనుగొనడంతో ఆరోగ్య అధికారులు పచ్చి పాలను తాగొద్దని సూచించారు. -
అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నా: యూఎస్ ప్రెసిడెంట్
న్యూయార్క్: ఆత్మ హాత్మ చేసుకోవాలనే ఆలోచనలు తనకు వచ్చాయని.. వెంటనే వాటి నుంచి బయటపడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డెలావేర్ మెమోరియల్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లిన తాను అక్కడి నుంచి దూకి ఆత్మచేసుకోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. అయతే తన పల్లల గురించి ఆలోచించి... ఆత్మహత్య చేసుకుకోవాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నని తెలిపారు. 1972 సంవత్సరంలో తొలిసారి సెనేటర్‌గా గెలుపొందిన కొన్నిరోజులకు బైడెన్... తన భార్య నీలియా, 18 నెలల బాబు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారని వెల్లండించారు. ఆ సమయలో చాలా బాధలో ఉన్న తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు.ఆ బాధలో తాగటం అలవాటు లేని తాను మందు బాటిల్ తీసుకొని డెలావేర్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లి తాగుతుండగా.. ఆత్మహత్య ఆలోచన వచ్చిందన్నారు. కానీ, తన మిగతా ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఆలోచించి.. ఆ నిర్ణయాన్ని విరమించుకున్నానని తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు వచ్చి ఆత్మహత్య చేసుకోవాలన్న పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అదే విధంగా మరో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుతూ.. అమెరికా ఎన్నికలకు ముందే డిబేట్లో పాల్గొనాలని ఉన్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఓ చోట ట్రంప్‌తో డిబేట్ తనకు సంతోషమన్నారు. దీనిపై ట్రంప్ సైతం ప్రతిస్పందించారు. ‘ నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయానికైనా బైడెన్‌తో డిబేట్‌కు అంగీకరిస్తున్నా’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ఇక.. అధ్యక్ష పదవి ఎన్నికల డిబేట్ల ఎన్నికల తేదీలు, వేదికల వివరాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 16న టెక్సాస్‌లోని శాన్ మార్కోస్, అక్టోబర్ 1న వర్జీనియాలోని పీటర్స్బర్గ్, అక్టోబర్ 9న సాల్ట్ లేక్ సిటీలో జరగనున్నాయి. -
జార్జ్ ఫ్లాయిడ్ తరహాలో మరో ఘటన.. ఊపిరాడటం లేదని వేడుకున్నా
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి తరహాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి బాడీ కెమెరా వీడియో ఫుటేజ్‌ను ఒహియో స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. ఈ ఘటన ఏప్రిల్ 18న చోటు చేసుకుంది. వివరాలు ప్రకారం.. ఫ్రాంక్ టైసన్ ( 53) అనే వ్యక్తిని హిట్ అండ్ రన్ కేసులో అనుమానితుడిగా భావించిన ఒహియో స్టేట్ పోలీసులు ఓ బార్లో బలవంతగా పట్టుకున్నారు. బార్లో ఉన్న ఫ్రాంక్ టైసన్‌ను లాక్కేళ్లుతూ.. మెడపై మోకాలు పెట్టి బలవంతంగా ఇద్దరు పోలీసులు బేడీలు వేసి ఊపరాడకుండా చేశారు. ఈ సమయంలో తనకు ఊపిరి ఆడటం లేదు.. తనను వదిలేయాలని ఎంత వేడుకున్నా ఆ ఇద్దరు పోలీసులు అస్సలు వినకుండా అతనిపై మోకాలు పెట్టి బేడీలు వేశారు. దీంతో నిమిషాల వ్యవధిలో అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక..ఇప్పటికే ఓ కిడ్నాప్ కేసులో 24 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఫ్రాంక్ టైసన్ ఏప్రిల్ 6న విడుదలయ్యారు. అయితే అతను తన పెరోల్‌కు సంబంధించి ఉన్నతాధికారికి రిపోర్టు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. 2020లో మినియాపొలిస్ పోలీసుల చేతిలో ఇదే జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మృతి మృతి అప్పట్లో తీవ్రం దుమారం రేపింది. అనతంరం జార్జ్ మరణానికి కారణమైన డెరిక్ చౌవిక్ను కోర్టు కఠిన శిక్ష విధించిన సంగతి విదితమే.NEW: 53-year-old man dies after getting taken to the ground by police and telling them that he couldn’t breathe. As Ohio man Frank Tyson was motionless on the ground, one officer could be heard bragging about the “bar fight.” Tyson had just gotten out of prison according to… pic.twitter.com/vGUTHfLHI6— Collin Rugg (@CollinRugg) April 26, 2024
Advertisement
Photos
View allVideo
View allబ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్‌లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్‌దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement