పాకిస్తాన్‌లో హక్కుల కార్యకర్త హత్య | human rights worker murdered at Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌లో హక్కుల కార్యకర్త హత్య

Apr 26 2015 4:17 AM | Updated on Sep 3 2017 12:52 AM

పాకిస్తాన్‌లో హక్కుల కార్యకర్త హత్య

పాకిస్తాన్‌లో హక్కుల కార్యకర్త హత్య

పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ హక్కుల ఉద్యమవేత్త సబీన్ మహ్మద్‌ను శుక్రవారం గుర్తుతెలియని సాయుధులు కాల్చి చంపారు.

కరాచీ: పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ హక్కుల ఉద్యమవేత్త సబీన్ మహ్మద్‌ను శుక్రవారం గుర్తుతెలియని సాయుధులు కాల్చి చంపారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మానవ హక్కులకు భంగం కలుగుతున్న అంశంపై కరాచీలో జరిగిన సెమినార్‌కు హాజరైన ఆమె.. అక్కడి నుంచి కారులో బయలుదేరిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది.

బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకీలతో కాల్పులు జరపడంతో సబీన్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ సమయంలో కారులోనే ఉన్న ఆమె తల్లి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ‘ది సెకండ్ ఫ్లోర్ (టీ2ఎఫ్)’ సంస్థ డెరైక్టర్ అయిన సబీన్ ప్రజల హక్కులు కోసం పోరాడారు.

Advertisement
 
Advertisement
Advertisement