అచ్చు మనిషి లాగే.. వైరల్ వీడియో | Human Face Monkey Video Viral In Social Media | Sakshi
Sakshi News home page

అచ్చు మనిషి లాగే.. వైరల్ వీడియో

Mar 25 2018 6:52 PM | Updated on Oct 22 2018 6:10 PM

Human Face Monkey Video Viral In Social Media - Sakshi

బీజింగ్: ఓ విచిత్ర వానరం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మనుషులను పోలినట్లుగా వానరం తల ఉండటంతో జూలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నెటిజన్లు కామెంట్లు చేస్తూ వీడియోను షేర్ చేస్తున్నారు. ఐదు రోజుల్లోనే కోటి మందికి పైగా వ్యూస్ రావడం గమనార్హం. చైనాలోని టియాంజిన్ నగరంలోని జూలో ఈ కోతి ఉంది.

18 ఏళ్ల ఈ వానరం స్పెషాలిటీ ఏంటంటే.. మనుషుల తల మాదిరిగా దీని తల ఉండటమే. ముక్కు, కళ్లు, నోరు అలాగే ఉండటంతో నెటిజన్లు ఈ వీడియోపై భారీ స్థాయిలో స్పందిస్తున్నారు. కొందరమైతే మనిషికి కోతి వేషం వేశారా అని అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, మరికొందరు నెటిజన్లు మాత్రం జూ పర్యవేక్షకుడు కోతిలా వేషం వేయలేదు కదా అంటూ కామెంట్ చేశారు. మనిషి కోతి నుంచే వచ్చాడంటూ ఎక్కువ మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement