పెరుగుతున్న హిల్లరీ ఆధిక్యం | Hillary Clinton leads Donald Trump by four points in latest national poll | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న హిల్లరీ ఆధిక్యం

Oct 4 2016 9:15 AM | Updated on Apr 4 2019 5:04 PM

పెరుగుతున్న హిల్లరీ ఆధిక్యం - Sakshi

పెరుగుతున్న హిల్లరీ ఆధిక్యం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీలో ఉన్న హిల్లరీ క్లింటన్.. తన ఆధిక్యాన్ని మళ్లీ పెంచుకుంటున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీలో ఉన్న హిల్లరీ క్లింటన్.. తన ఆధిక్యాన్ని మళ్లీ పెంచుకుంటున్నారు. మొట్టమొదటగా నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల డిబేట్ అనంతరం ఆమె పట్ల ఆదరణ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా నిర్వహించిన ఒక పోల్ సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటే ఆమె నాలుగు శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది. సీబీఎస్ న్యూస్ / ద న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన పోల్‌లో హిల్లరీ క్లింటన్‌కు 45 శాతం మంది అనుకూలంగా ఓట్లు వేయగా, ట్రంప్‌కు కేవలం 41 శాతం మందే అనుకూలంగా ఉన్నారు. గత నెలలో ఇదే సంస్థలు నిర్వహించిన పోల్‌లో ఇద్దరికీ సమానంగా 42 శాతం చొప్పున ఓట్లు వచ్చాయి.

రియల్ క్లియర్ పాలిటిక్స్ అనే మరో సంస్థ నిర్వహించిన పోల్స్‌లో కూడా హిల్లరీ క్లింటన్‌కు 3.1 శాతం పాయింట్ల ఆధిక్యం కనిపించింది. ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్ మీద ఆధిక్యం కనబర్చడం హిల్లరీకి బ ఆగా కలిసొచ్చిన అంశమని సీబీఎస్ న్యూస్/ న్యూయార్క్ టైమ్స్ పోల్ తెలిపింది. లైక్లీ ఓటర్లలో అయితే హిల్లరీ ఆధిక్యం మరింత ఎక్కువగా ఉంది. తాము క్లింటన్ వైపు మొగ్గుతామని చెప్పినవారు 32 శాతం ఉంటే, ఆమె నచ్చలేదని చెప్పినవాళ్లు 16 శాతమే ఉన్నారు. ఫ్లోరిడా, ఉత్తర కరొలినా, పెన్సల్వేనియా రాష్ట్రాల్లో హిల్లరీ ఆధిక్యంలో ఉండగా, ఓహియోలో మాత్రం ట్రంప్ ముందున్నారని క్వినిపియాక్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాల్లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement