హెల్మెట్‌తో వెన్నెముకకు రక్ష

Helmet use associated with reduced risk of cervical spine injury during motorcycle crashes - Sakshi

వాషింగ్టన్‌: ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్‌ ధరించడం వల్ల వెన్నెముక మెడ పైభాగానికి (సర్వైకల్‌ స్పైన్‌) గాయం కాకుండా తప్పించుకోవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రమాద సమయంలో వెన్నెముకకు గాయం కాకుండా హెల్మెట్‌ కాపాడలేదని.. పైగా హెల్మెట్‌ వల్ల కొన్నిసార్లు వెన్నెముకకు గాయమయ్యే ప్రమాదం కూడా ఉందని అనేకమంది భావిస్తారు.

అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని పరిశోధకులు అంటున్నారు. అమెరికాలోని యూని వర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ హాస్పిటల్స్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా 2010–15 మధ్య విస్కాన్సిన్‌ ఆస్పత్రిలో నమోదైన 1,061 మంది వాహన ప్రమాద బాధితుల మెడికల్‌ రిపోర్టులను  పరిశీలించారు. వీరిలో 323 మంది ప్రమాద సమయంలో హెల్మెట్‌ ధరించగా.. 738 మంది హెల్మెట్‌ ధరించలేదు. హెల్మెట్‌ లేని వారిలో ఈ తరహా గాయాలయ్యే అవకాశం 10.8% ఉండగా.. ధరించిన వారిలో 4.6%గా ఉందన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top