24 మంది క్రైస్తవుల కాల్చివేత | Gunmen kill number of Christians in Egypt | Sakshi
Sakshi News home page

24 మంది క్రైస్తవుల కాల్చివేత

May 26 2017 4:42 PM | Updated on Sep 5 2017 12:03 PM

24 మంది క్రైస్తవుల కాల్చివేత

24 మంది క్రైస్తవుల కాల్చివేత

ఈజిప్టులో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు.

కైరో: ఈజిప్టులో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. విచక్షణ లేకుండా ఓ బస్సుపై కాల్పులతో మారణకాండ సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే దక్షిణ ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్‌ అన్బా శామ్యూల్‌ మొనాస్టరీకి బస్సులో వెళ్తున్న క్రైస్తవులపై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 23 మంది అక్కడికక్కడే చనిపోగా 25మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. పరారీలో ఉన్న దుండగుల కోసం గాలింపు చేపట్టారు. దేశంలోని కోప్టిక్‌ క్రైస్తవులపై గత కొంతకాలంగా ఐఎస్‌ఐ తీవ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఏప్రిల్‌లో రెండు చర్చిలపై జరిగిన బాంబు దాడుల్లో 46 మంది చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement