అమెరికాలో 28% పెరిగిన భారత విద్యార్థులు | Growing up in the United States, 28% of Indian students | Sakshi
Sakshi News home page

అమెరికాలో 28% పెరిగిన భారత విద్యార్థులు

Nov 15 2014 3:31 AM | Updated on Sep 2 2017 4:28 PM

అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య 1,34,292కు చేరిందని తాజా నివేదిక వెల్లడించింది.

వాషింగ్టన్: అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నెల 7వ తేదీ నాటికి అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య 1,34,292కు చేరిందని తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్యలో 28 శాతం పెరుగుదల ఉందని పేర్కొంది. హోమ్‌లాండ్ సెక్యూరిటీకి చెందిన ‘ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్’ విభాగం విదేశీ విద్యార్థులపై ఈ నివేదిక విడుదల చేసింది. విదేశీ విద్యార్థుల్లో అధికశాతం మంది కాలిఫోర్నియా(18,212), టెక్సాస్(17,033), న్యూయార్క్(14690), ఇల్లినాయీ(8427), మసాచుసెట్స్(6,763)లలో చదువుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement