హెలికాప్టర్‌లో వెళ్లి.. బుర్జ్ దుబాయ్‌పై పెళ్లి.. | Get married went to the Burj Dubai in a helicopter .. .. | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్‌లో వెళ్లి.. బుర్జ్ దుబాయ్‌పై పెళ్లి..

Apr 25 2014 12:18 AM | Updated on Sep 2 2017 6:28 AM

హెలికాప్టర్‌లో వెళ్లి.. బుర్జ్ దుబాయ్‌పై పెళ్లి..

హెలికాప్టర్‌లో వెళ్లి.. బుర్జ్ దుబాయ్‌పై పెళ్లి..

ప్రపంచంలోనే అతి ఎత్తై భవనం బుర్జ్ దుబాయ్‌లో పెళ్లి చేసుకునే అవకాశం వస్తే..? అదీ ఆకాశంలో అంతెత్తున వేలాడుతున్నట్లుగా ఉండే.. హెలీప్యాడ్‌పై ఆ ముచ్చట తీర్చుకోగలిగితే..?

దుబాయ్: ప్రపంచంలోనే అతి ఎత్తై భవనం బుర్జ్ దుబాయ్‌లో పెళ్లి చేసుకునే అవకాశం వస్తే..? అదీ ఆకాశంలో అంతెత్తున వేలాడుతున్నట్లుగా ఉండే.. హెలీప్యాడ్‌పై ఆ ముచ్చట తీర్చుకోగలిగితే..? భలేగా ఉంటుంది కదూ.. బుర్జ్ దుబాయ్ హోటల్ నిర్వాహకులు ఈ అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నారు. భూమి నుంచి 212 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ హెలిప్యాడ్‌పై పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వారే చేస్తారు.

పైగా మీ విడిది నుంచి ‘అగస్టా 109’ హెలికాప్టర్‌లోగానీ, అత్యంత ఖరీదైన రోల్స్‌రాయిస్ ఫాంటమ్ కారులోగానీ హోటల్ వద్దకు వెళ్లొచ్చు.. హోటల్‌లోని ఖరీదైన సూట్‌లో బస చేయొచ్చు. అక్కడి ప్రఖ్యాత వంటగాళ్లతో మనకిష్టమైన వంటకాలు చేయించుకునీ తినొచ్చు.. అసలు మొత్తంగా పెళ్లంటే ఇదేరా..! అనేట్లుగా వైభవోపేతంగా వేడుకలు జరుపుకోవచ్చు. దీనంతటికీ జస్ట్.. 35 లక్షల రూపాయలు చెల్లిస్తే చాలు. అయితే, పెళ్లికొడుకు, పెళ్లికూతురు కోరుకునే డెకరేషన్, ఇతర సౌకర్యాల ఆధారంగా చెల్లించాల్సిన రుసుమును నిర్ణయిస్తారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement