పైలట్‌ చాకచక్యం.. తప్పిన ప్రమాదం

Gear failed Myanmar passenger jet lands safely - Sakshi

యాంగాన్‌ : పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి ఏడుగురు విమాన సిబ్బంది సహా మొత్తం 89 మంది ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన మయన్మార్‌లోని మాండలే అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. విమానంలో సాంకేతికలోపంతో ముందు భాగంలోని టైరు తెరచుకోలేదు. దీంతో రన్‌ వేపై పైలట్‌ ఆ విమానాన్ని దింపుతున్న సమయంలో ముందు భాగం రోడ్డును తాకింది. పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులతోపాటు సిబ్బందికి గాయాలు కాలేదు.

యూబీ 103 విమానంలో  ఆదివారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తడంతో  ఈ ఘటన చోటు చేసుకుంది. ‘ముందు భాగంలోని టైరు తెరుచుకోకపోవడంతో వెనకవైపున ఉండే టైర్ల సాయంతో మాత్రమే విమానాన్ని దించాల్సి వచ్చింది. పైలట్‌ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విమానాన్ని సురక్షితంగా దించారు’ అని ఓ అధికారి తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top