ఉచిత ఇంటర్నెట్‌ ప్రాథమిక హక్కు | Sakshi
Sakshi News home page

ఉచిత ఇంటర్నెట్‌ ప్రాథమిక హక్కు

Published Tue, Nov 12 2019 4:24 AM

Free internet access should be a basic human right - Sakshi

లండన్‌: ఇంటర్నెట్‌ సేవలను ఉచితంగా పొందడమన్నది మానవుల ప్రాథమిక హక్కు అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలు ఇంటర్నెట్‌ను పొందలేకపోతున్నారని, దీంతో ప్రపంచ స్థాయి వ్యక్తులతో సమానంగా తమ జీవితాలను బాగుపరుచుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయని పేర్కొంది. ఈ అధ్యయనాన్ని చేపట్టిన బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ పరిశోధకులు భారత్‌లోని కేరళ రాష్ట్రాన్ని ఓ ఉదాహరణగా చూపారు. ఇంటర్నెట్‌ పొందడమనేది ప్రాథమిక హక్కుగా కేరళ రాష్ట్రం ప్రకటించిందని, ఈ ఏడాది చివర కల్లా 3.5 కోట్ల మందికి ఇంటర్నెట్‌ను అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. కొందరికి ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండి.. మరికొందరికి లేకపోవడం వల్ల ప్రాథమిక స్వేచ్ఛగా పేర్కొనే వ్యక్తీకరణ, సమాచార స్వేచ్ఛలను కోల్పోతారంది.

Advertisement
Advertisement