ఫ్రాన్స్‌లో మేక్రాన్‌పార్టీ ఘన విజయం! | France's Emmanuel Macron seizes big majority in parliament | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌లో మేక్రాన్‌పార్టీ ఘన విజయం!

Jun 19 2017 1:55 AM | Updated on Sep 5 2017 1:56 PM

ఫ్రాన్స్‌లో మేక్రాన్‌పార్టీ ఘన విజయం!

ఫ్రాన్స్‌లో మేక్రాన్‌పార్టీ ఘన విజయం!

ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఆదేశాధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మేక్రాన్‌ నేతృత్వంలోని పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది.

పారిస్‌: ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఆదేశాధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మేక్రాన్‌ నేతృత్వంలోని పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 577 సీట్ల నేషనల్‌ అసెంబ్లీలో మేక్రాన్‌ పార్టీ ‘ఎన్‌ మార్చ్‌’తోపాటు ఈ పార్టీ నేతృత్వంలోని కూటమి 355 నుంచి 425 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి.

రెండో విడత ఎన్నికల్లో తాజా ఫలితాలు వెలువడే సరికి అతిరథమహారథులైన నాయకులంతా దారుణంగా ఓడిపోయారు. యువకులు, మహిళలతో కూడిన కొత్తతరం నాయకులు పార్లమెంట్లో కాలుపెట్టనున్నారు. ఏడాదిన్నర క్రితమే కొత్త పార్టీని స్థాపించిన మేక్రాన్‌కు ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లోనూ ప్రజలు బ్మహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. రిపబ్లికన్లు, సోషలిస్టులకు ఈ ఎన్నికలు చేదు ఫలితాలను మిగిల్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement