మాలికి అండగా ఫ్రాన్స్ బలగాలు | France forces joined with mali forces | Sakshi
Sakshi News home page

మాలికి అండగా ఫ్రాన్స్ బలగాలు

Nov 20 2015 7:25 PM | Updated on Sep 3 2017 12:46 PM

మాలికి అండగా ఫ్రాన్స్ బలగాలు

మాలికి అండగా ఫ్రాన్స్ బలగాలు

ఉగ్రవాదంతో ఇటీవల తీవ్రంగా ప్రభావితమైన ఫ్రాన్స్ మాలిలో ఉగ్రవాదుల దాడిపై వేగంగా స్పందించింది

ఉగ్రవాదంతో ఇటీవల తీవ్రంగా ప్రభావితమైన ఫ్రాన్స్....మాలిలో ఉగ్రవాదుల దాడిపై వేగంగా స్పందించింది. ఉగ్రవాదులను ఏరివేయటంలో మాలి సైన్యానికి బాసటగా నిలిచేందుకు తమ సైన్యాన్ని రంగంలోకి దింపింది. పారిస్ దాడుల నేపథ్యంలో ఉగ్రవాదాన్ని ప్రపంచదేశాలన్నీ కలిసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చిన ఫ్రాన్స్ ఆ దిశగా సాయం అందించింది.

పశ్చిమ ఆఫ్రికా దేశం మాలీ రాజధాని బమాకాలోని ఓ హోటల్పై ఉగ్రవాదులు శుక్రవారం దాడికి పాల్పడి 170 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఆయుధాలతో రాడిసన్ హోటల్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాధితులను విడిపించడానికి ఇప్పటికే మాలిలోని భద్రతా బలగాలు ఉగ్రవాదులతో పోరాడుతుండగా వారికి ఫ్రాన్స్ బలగాలు సహకారం అందించడానికి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భద్రతా దళాలు ఇప్పటికే 80 మంది బందీలకు విముక్తిని కల్పించగా మిగతా వారికోసం పోరాడుతున్నారు. ఉగ్రవాదులు ఇప్పటికే పలువురు బందీలను హతమార్చినట్లు తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement