అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి | four killed in shooting at american mall, ems arrives | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి

Sep 24 2016 9:00 AM | Updated on Apr 4 2019 5:12 PM

అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి - Sakshi

అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మాల్‌లోకి చొరబడిన దుండగుడు (లు?) కాల్పులు జరపడంతో నలుగురు మరణించారు.

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మాల్‌లోకి చొరబడిన దుండగుడు (లు?) కాల్పులు జరపడంతో నలుగురు మరణించారు. సీటిల్ నగరానికి ఉత్తరంగా ఉన్న బర్లింగ్టన్‌లోని ఈ మాల్‌లో కాల్పులు జరిపినవారు పోలీసులు అక్కడికి చేరుకునేలోపే అక్కడి నుంచి పరారయ్యారు. నలుగురు మరణించిన విషయాన్ని వాషింగ్టన్ రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన సార్జంట్ మార్క్ ఫ్రాన్సిస్ నిర్ధారించారు. ప్రస్తుతం ఆ మాల్‌ను క్లియర్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మాల్‌లో ఉన్న క్షతగాత్రులను బస్సులో 'హిజ్ ప్లేస్' చర్చి వద్దకు తీసుకెళ్తామని కూడా ఆయన చెప్పారు. అత్యవసర వైద్యసేవల బృందం మాల్ వద్దకు చేరుకుంది. పోలీసు రక్షణతో వచ్చిన ఆ బృందం.. గాయపడిన వారికి అత్యవసరంగా చేయాల్సిన వైద్యసేవలు అందిస్తోంది.

1990లో బర్లింగ్టన్‌లో ప్రారంభమైన కాస్కేడ్ మాల్‌లో జేసీ పెన్నీ, టీజే మాక్స్, మేసీస్ స్టోర్స్, మరికొన్ని స్టోర్లు, రెస్టారెంట్లు, ఒక థియేటర్ ఉన్నాయి. దీంతో అక్కడకు స్థానికులు బాగానే వస్తుంటారు. అలాంటి మాల్‌లో ఉన్నట్టుండి కాల్పులు జరగడంతో అంతా భయభ్రాంతులకు లోనయ్యారు. గన్ కల్చర్ గురించి విపరీతంగా చర్చలు నడుస్తున్న తరుణంలో మళ్లీ కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement