టేకాఫ్ తీసుకోగానే కూలిన విమానం | Four killed in plane crash in Houston | Sakshi
Sakshi News home page

టేకాఫ్ తీసుకోగానే కూలిన విమానం

Jul 9 2016 11:17 AM | Updated on Sep 4 2017 4:29 AM

టేకాఫ్ తీసుకోగానే కూలిన విమానం

టేకాఫ్ తీసుకోగానే కూలిన విమానం

టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే ఓ విమానం కూలిపోయిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు.

హ్యూస్టన్: టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే ఓ విమానం కూలిపోయిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు. ఈ ఘటన అమెరికాలోని హ్యూస్టన్లో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న 'పైపర్ పీఏ-32' రకానికి చెందిన విమానం వెస్ట్ హ్యూస్టన్ ఎయిర్పోర్ట్ సమీపంలో కూలిపోయినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలో విమానంలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎయిర్పోర్ట్ సమీంపలోని చెట్ల పొదల్లో విమానం కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నేలను తాకగానే భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో విమానం తునాతునకలైనట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మృతిచెందిన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విమానం కూలిపోవటానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement