చైనా ఫ్యాక్టరీలో పేలుడు | factory blast in china claims 68 lives | Sakshi
Sakshi News home page

చైనా ఫ్యాక్టరీలో పేలుడు

Aug 3 2014 2:06 AM | Updated on Sep 2 2017 11:17 AM

చైనా ఫ్యాక్టరీలో పేలుడు

చైనా ఫ్యాక్టరీలో పేలుడు

తూర్పు చైనాలోని జియాంగ్జు రాష్ట్రంలో ఒక లోహ పరిశ్రమలో శనివారం భారీ పేలుడు సంభవించింది. 68 మంది మృతి చెందగా, 187 మంది గాయపడ్డారు.

68 మంది మృతి, 187 మందికి గాయాలు

బీజింగ్: తూర్పు చైనాలోని జియాంగ్జు రాష్ట్రంలో ఒక లోహ పరిశ్రమలో శనివారం భారీ పేలుడు సంభవించింది. 68 మంది మృతి చెందగా, 187 మంది గాయపడ్డారు.  షాంఘై నగరానికి చేరువలోని కున్షాన్ పట్టణంలో ఉన్న ప్రఖ్యాత వీల్ హబ్ పాలిషింగ్ కంపెనీ కున్షాన్ జోంగ్రాంగ్ మెటల్ ప్రొడక్ట్స్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా ఉత్పత్తులను సరఫరా చేసే పెద్ద కంపెనీల్లో ఇదీ ఒకటి.

ప్రఖ్యాత జనరల్ మోటార్స్ లాంటి సంస్థలకు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. పేలుడు సమయంలో ఆ ఫ్యాక్టరీలో 260 మంది ఉన్నారు. 40 మృతదేహాలు ప్రమాద స్థలంలో లభించాయని, మిగతా 28 మంది ఆస్పత్రితో మృతిచెందారని మీడియా తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement