ఫేస్బుక్ కార్యాలయంపై దాడి | Facebook offices in Germany vandalised | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ కార్యాలయంపై దాడి

Dec 14 2015 10:25 AM | Updated on Jul 26 2018 5:23 PM

ఫేస్బుక్ కార్యాలయంపై దాడి - Sakshi

ఫేస్బుక్ కార్యాలయంపై దాడి

జర్మనీలో ఫేస్బుక్ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.

లండన్: జర్మనీలో ఫేస్బుక్ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. హాంబర్గ్లోని ఫేస్బుక్ కార్యాలయంపై దాదాపు 20 మంది దాడి చేసి అద్దాలు పగలగొట్టి, పెయింట్ చల్లారు. కార్యాలయం ప్రవేశద్వారం వద్ద 'ఫేస్బుక్ డిజ్లైక్' అని రాసినట్టు జర్మన్ మీడియా వెల్లడించింది.

దాడి చేసిన దుండగులు నల్లటి దుస్తులు, ముసుగులు ధరించినట్టు హాంబర్గ్ పోలీసులు చెప్పారు. ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్న జాతి వివక్ష వ్యాఖ్యల వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని జర్మనీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫేస్బుక్లో పోస్ట్ చేసిన జాతిని రెచ్చగొట్టే ప్రసంగాలను తొలగించడంలో విఫలమైనందుకు ఫేస్బుక్ యూరప్ విభాగం చీఫ్ జర్మనీలో విచారణ ఎదుర్కొంటున్నారు. కాగా జర్మనీ చట్టాలను తాము ఉల్లంఘించలేదని ఫేస్బుక్ ప్రతినిధి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement