పాక్‌ ఎన్నికలు.. ఫేస్‌బుక్‌ సంచలన నిర్ణయం

Facebook Disables Accounts Of Hafiz Saeed Political Party - Sakshi

హఫీజ్‌ సయ్యద్‌ పార్టీ ఖాతాను బ్లాక్‌ చేసిన ఫేస్‌బుక్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో త్వరలో జరుగునున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫేస్‌బుక్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మార్క్‌ జూకర్‌బర్గ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలపాలను పోత్సహించే సంస్థల ఖాతాలను బ్లాక్‌ చేస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటన తెలిపారు. జాలై 25 నుంచి పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సహకరించాలని, చట్టబద్ధంగా నమోదు చేయని సంస్థలను రద్దుచేయాలని పాక్‌ ఎన్నికల కమిషన్‌ ఇటీవల జూకర్‌బర్గ్‌ను కోరింది. దీనిపై స్పందించిన బర్గ్‌.. ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు సృష్టించే వివాదాస్పద సంస్థల పేజీలకు, ఫేక్‌ ఎకౌంట్లను బ్లాక్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఫేస్‌బుక్‌ రద్దు చేసిన వాటిలో ముంబై దాడులు సూత్రదారి హఫీజ్‌ సయ్యద్‌ స్థాపించిన జమత్‌-ఉద్‌-దావా, ఇస్లామిక్‌ మల్లీ ముస్లిం లీగ్ ‌(ఎమ్‌ఎమ్‌ఎల్‌) సంస్థలు ఉన్నాయని ఫేస్‌బుక్‌ వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఎన్నికలు జరుగనున్న భారత్‌, బ్రెజిల్‌, మెక్సికో దేశాల్లో కూడా ఇదే పద్దతిని అనుసరిస్తామని జూకర్‌బర్గ్‌ ప్రకటించారు. సోషల్‌ మీడియా తీసుకున్న నిర్ణయంపై ఎమ్‌ఎమ్‌ఎల్‌ ఛీప్‌ సయ్యద్‌ మండిపడ్డారు. సోషల్‌ మీడియా అనేది ప్రతి ఒక్కరు తమ ప్రచార అస్తంగా ఉపయోగించుకుంటారని ఎలాంటి సమాచారం లేకుండా తమ ఖాతాలను బ్లాక్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు.

పార్టీ సిద్దాంతాలను, వారి సందేశాలను ప్రజలకు చేరవేయడానికి సోషల్‌ మీడియా ఎంతో ఉపకరిస్తుందని తమ అభ్యర్థుల పేజీలను రద్దు చేయడం న్యాయం కాదన్నారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఫేస్‌బుక్‌పై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిషత్తులో సోషల్‌ మీడియాపై ఎలాంటి విమర్శలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జూకర్‌బర్గ్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top