breaking news
Hafeez Sayeed
-
పాక్ కల్నల్ ఇమ్రాన్ దారుణ హత్య.. భారత్ హస్తం?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో సంచలన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్లో భారత్ వ్యతిరేకులను టార్గెట్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. వారిని వెంటాడి మరీ చంపుతున్నారు. తాజాగా పహల్గాం ఉగ్రవాద దాడి ప్లాన్‌కు కారణమని భావిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నర్ ఇమ్రాన్ దయాల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చడం పాకిస్తాన్‌ను టెన్షన్‌కు గురిచేస్తోంది. ఇమ్రాన్ దయాల్ ఐఎస్ఐ చీఫ్ హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు కావడం విశేషం.వివరాల మేరకు.. పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేశారు. బుధవారం(జనవరి 28వ తేదీన) డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని షోర్ కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్ దయాల్ చనిపోయాడు. అయితే, పాక్ అధికారులు మాత్రం ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఇమ్రాన్ లక్ష్యంగా జరగలేదని, వ్యక్తిగత శత్రుత్వం, ప్రణాళికబద్ధమైన దాడితో సంబంధం లేదని అధికారులు తెలిపారు. రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించినట్లు అక్కడి మీడియా చెప్పుకుంటోంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో దయాల్ చిక్కుకున్నాడని చెబుతోంది.BIG BREAKING NEWS 🚨 Pakistani Army Lt Col Imran Dayal shot dead by UNKNOWN MEN in Dera Ismail Khan, Pakistan.As per news reports, he was identified as a handler in the 2025 Pahalgam terror attack.ISI is also clueless. Police have no idea. He was a very close associate of… pic.twitter.com/747JDjA0yb— News Algebra (@NewsAlgebraIND) January 31, 2026కానీ, దాడి కారణంగా ఇమ్రాన్ వాహనం పూర్తిగా దెబ్బతిన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ దాడులు ఎవరు చేశారనే వివరాలు ఐఎస్ఐ, పాక్ పోలీసులు, పాక్ సైన్యానికి అంతు చిక్కడం లేదు. భారత్ మోస్ట్ వాంటెట్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఇమ్రాన్ దయాల్ అత్యంత సన్నిహితుడు. ఇక, ఇమ్రాన్ దయాల్.. భారత్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ముఖ్య కారకుడు అని తెలుస్తోంది. ఇమ్రాన్ హత్యతో రంగంలోకి దిగిన అధికారులు.. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా దాడులతో పాక్ ప్రభుత్వం, పాక్ సైన్యంలో ఆందోళన మొదలైనట్టు సమాచారం. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు, ఇలా పాక్తిస్తాన్కు చెందిన కీలక నేతలను హతమారుస్తున్న నేపథ్యంలో వారంతా భారత్ దురంధర్‌లు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. భారత్‌కు చెందిన సీక్రెట్ ఏజెంట్లే వారిని హతమారుస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 🚨 BIG! Pakistani Army Lt Col Imran Dayal, identified as a handler in the 2025 Pahalgam terror attack, was SHOT DEAD by UNIDENTIFIED GUNMEN in Dera Ismail Khan👉 UNKNOWN GUNMEN continue to ELIMINATE terrorists in Pakistan 🔥#Agyat 👍👌👏 pic.twitter.com/lIqgxzBRsg— DR. AMIT MANOHAR (@dramitmanohar) January 31, 2026ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ప్రత్యేక ప్రాంతం బలూచిస్తాన్‌లో ఆ ప్రాంతానికి చెందిన తిరుగుబాటు సంస్థ బీఎల్ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) పాక్ భద్రతా సిబ్బందిపై దాడులకు దిగింది. దీంతో పాక్ పోలీసులు కూడా ఎదురుదాడులకు దిగారు. ఈ కాల్పుల్లో 10 మంది పాక్ పోలీసులు మరణించగా, 80 మంది బీఎల్ఏ ఉద్యమకారులు మరణించినట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్ ప్రాంతంలోని ఐదు జిల్లాలకు చెందిన 12 ప్రదేశాల్లో, ఏకకాలంలో ‘ఆపరేషన్ హీరోఫ్’ పేరుతో బీఎల్ఏ దాడులకు దిగింది. పాకిస్తాన్ ఆర్మీ, భద్రతా సిబ్బందిపై గన్స్, ఇతర ఆయుధాలతో దాడి చేయడంతోపాటు ఆత్మాహుతి దాడులకు దిగింది. క్వెట్టా, మాస్తంగ్, నుష్కి, పస్ని, గ్వాదర్ జిల్లాల్లో బీఎల్ఏ దాడులు చేసింది. దీంతో పాక్ సిబ్బంది కూడా ఎదురు కాల్పులకు దిగి, బీఎల్ఏ దాడుల్ని తిప్పికొట్టారు. అయితే, బలూచ్ నేతలే ఇమ్రాన్‌ను హత్య చేశారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. కాగా, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో కొన్నేళ్లుగా తిరుగుబాటు ఉద్యమం నడుస్తోంది. పాకిస్తాన్ నుంచి వేరుపడాలని కోరుతూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దళాలలకు, బీఎల్ఏకు మధ్య నిరంతరం ఘర్షణ కొనసాగుతూనే ఉంది.Dera Ismail Khan: Shaheed Lieutenant Colonel Imran Dayal was laid to rest in his ancestral village with full military honors.The funeral prayers were attended by GOC 40 Division, Major General Mudassar, who presented the national flag, which was received by the martyr’s son pic.twitter.com/ggnjdcuIuf— Makhdoom Shahab-ud-Din (@ShahabSpeaks) January 30, 2026 -
పాకిస్తాన్ నక్క బుద్ది.. భారత్ టార్గెట్‌గా భారీ ప్లాన్?
ఇస్లామాబాద్: కుక్క తోక వంకర అనే విధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. ఉగ్రవాదం విషయంలో బహిరంగ వేదికలపై తమ దేశం వ్యతిరేకం అంటూనే.. అంతర్గతంగా మాత్రం టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైనప్పటికీ.. తాజాగా మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆ దేశ సైన్యం భద్రతా సంస్థలు కలిసి రెండో తరం ఉగ్రవాద నాయకత్వాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకుంటున్నట్టు తెలిసింది. వీరిలో సీనియర్ ఉగ్రవాద కమాండర్ల కుమారులు, వారి దగ్గరి బంధువులు ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి. వీరంతా భారత్ టార్గెట్‌గా దాడులకు ప్లాన్ చేస్తున్నారనే సమాచారం బయటకు వచ్చింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల పాకిస్తాన్‌లోని బహవల్పూర్లో ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), పాకిస్తాన్ ఆర్మీ అధికారుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తదుపరి తరం నాయకత్వంగా వర్ణించబడిన ఉగ్రవాద సంస్థల సీనియర్ కమాండర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. జమ్ముకశ్మీర్‌లోకి పెద్ద ఎత్తున చొరబాట్లను ప్లాన్ చేయడం, భవిష్యత్తులో ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడమే ముఖ్య లక్ష్యమని చర్చించుకున్నట్టు తెలిసింది. అయితే, జమ్ముకశ్మీర్‌లో ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైష్-ఏ-మొహమ్మద్ (జెఎమ్) కలిసి పనిచేస్తున్నాయని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి.పహల్గాం తరహా ప్లాన్?మరోవైపు.. సీనియర్ లష్కరే కార్యకర్తలు తల్హా సయీద్, సైఫుల్లా కసూరి, జైష్ కమాండర్ అబ్దుర్ రౌఫ్‌తో ఇటీవలే బహవల్పూర్కు చేరుకున్నారు. అక్కడే జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌తో తల్హా సయీద్, సైఫుల్లా కసూరి రహస్య సమావేశం నిర్వహించారని నిఘా వర్గాలు తెలిపాయి. కాగా, పహల్గాం దాడికి ముందు కూడా ఇలాంటి సమావేశాలు జరిగాయని నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ సమావేశం ఇది రెండు ఉగ్రవాద సంస్థల మధ్య సమన్వయాన్ని మరింతగా పెంచుతుందనే అనుమానాలను బలపరుస్తోంది.హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి సీనియర్ ఉగ్రవాద నాయకుల నుండి వారి వారసుల వైపు ISI ఇప్పుడు దృష్టిని మళ్లిస్తోందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. నాయకత్వం, కార్యకలాపాల కొనసాగింపును నిర్ధారించడానికి రెండో తరం ఉగ్రవాద కార్యకర్తలను ప్రోత్సహించడం, నిధులు సమకూర్చడం ఈ వ్యూహంలో భాగంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఇందుకు అత్యంత ప్రముఖ వ్యక్తులలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా ఉన్నారు. సైద్ధాంతికంగానే కాకుండా సంస్థాగత నిర్వహణ, నిధుల నెట్‌వర్క్‌లు మరియు అంతర్జాతీయ సంబంధాలలో కూడా అతన్ని క్రమపద్ధతిలో తీర్చిదిద్దుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.అదేవిధంగా, మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అస్గర్‌కు ISI మద్దతు, శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. కాగా, అస్గర్.. జైష్-ఎ-మొహమ్మద్‌లో కార్యకలాపాలను ప్లాన్ చేయడం, ఉగ్రవాద మాడ్యుల్స్ సిద్ధం చేయడం, సరిహద్దు కార్యకలాపాలను సమన్వయం చేయడం వంటి పెద్ద నాయకత్వ పాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రౌఫ్ అస్గర్ గతంలో అనేక ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో పాక్ చర్చలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనే చర్చ మొదలైంది. -
అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు ఎట్టకేలకు శిక్ష
-
హఫీజ్ సయీద్‌కు బెయిల్
ఇస్లామాబాద్ : ముంబై ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ కోర్టు సోమవారం వెయిల్ మంజూరు చేసింది. ఉగ్రవాద సంస్థలు, ఉగ్ర కార్యకలాపాలను పాక్ భూభాగం నుంచి నిరోధించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న క్రమంలో హఫీజ్ సయీద్‌కు పాక్ కోర్టు బెయిల్ మంజూరు కావడం గమనార్హం. హఫీజ్ సయీద్ ఉగ్రవాద సంస్ధలకు నిధులు సమకూరుస్తున్నారని గత నెల ఆయనపై కేసు నమోదైంది. హఫీజ్‌పై పాకిస్తాన్లో 23 ఉగ్రవాద సంబంధిత కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు ఎదుట ప్రభుత్వం సరైన ఆధారాలు చూపకపోవడంతో హఫీజ్‌కు బెయిల్ మంజూరైంది. -
పాక్ అరకొర చర్యలు
ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ శిక్షణ శిబిరంపై సైనిక చర్య ముగిసిందని మన దేశం ప్రకటించిన రోజే ఆ సంస్థ చీఫ్ మసూద్ అజర్ కుమారుణ్ణి, అతడి సోదరుణ్ణి...వారితోపాటు మరో 42మందిని అరెస్టు చేసినట్టు, ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్–ఉద్–దవా(జేయూడీ)ను నిషేధిస్తున్నట్టు పాకిస్తాన్ వెల్లడించింది. ఈ చర్య వల్ల ఇరు దేశాలమధ్యా పుల్వామా ఉగ్రదాడి అనంతరం నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతానికి ఉపశమిస్తాయని అందరూ ఆశిస్తారు. గత నెల 14న పుల్వామాలో 43మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడి జరిగాక 27న మన వైమానిక దళ యుద్ధ విమానాలు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలపైనా, మరో రెండు ఉగ్ర స్థావరాలపైనా దాడులు నిర్వహించాయి. దాంతో ఇరుదేశాలమధ్యా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దుల్లో నాలుగైదు రోజులపాటు భారీగా కాల్పులు జరిగాయి. మన పైలట్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ సైన్యానికి చిక్కారు. అంతర్జాతీయ ఒత్తిళ్లతో పాక్ ఆయన్ను చివరకు విడుదల చేయకతప్పలేదు. పుల్వామా దాడి వెనక పాక్‌లోని జైషే సంస్థ హస్తం ఉన్నదని భారత్ చేసిన ఆరోపణ చేశాక ‘మీ దగ్గరున్న సమాచారాన్నిస్తే చర్య తీసుకుంటాం’ అని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు. దాంతో ఆ సమాచారం మొత్తాన్ని గతవారం పాకిస్తాన్‌కు అందించింది. ఇక ఇప్పుడు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్‌పై ఉంది. మన దేశం అందించిన ఆ సమాచారం ఫలితమో, మరే కారణమో ఉగ్రవాద ముఠాలపై పాకిస్తాన్ చర్య తీసుకుంటున్న జాడలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో దానికి సమాంతరంగా కొన్ని అయోమయ ప్రకటనలు కూడా వెలువడుతున్నాయి. పాకిస్తాన్లో ఇది రివాజే. ప్రభుత్వం కొన్ని ఉగ్రవాద సంస్థలపై లేదా కొందరు ఉగ్రవాదులపై చర్య తీసుకుంటున్నామని చెబుతుంది. అదే సమయంలో సైన్యం దానికి విరుద్ధంగా మాట్లాడుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. ఇది ఆశ్చర్యకరమైనదే. ఎందుకంటే ఇమ్రాన్‌ఖాన్ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఆవిర్భవించి, ఎన్ని కల్లో మెజారిటీ సాధించడానికి సైన్యం ఎడాపెడా సాయం చేసిందని చెబుతారు. సారాంశంలో ఇప్పుడున్నది దాని ఆమోదంతో ఏర్పడిన ప్రభుత్వమే. అయినా ప్రభుత్వమూ, సైన్యమూ భిన్న స్వరాలు వినిపించడం విడ్డూరం కలిగిస్తుంది. నాలుగురోజులక్రితం పాకిస్తాన్ విదేశాంగమంత్రి షా మహ్మూద్ ఖురేషీ జైషే చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలోనే ఉన్నాడని, కాకపోతే ఆయన తీవ్ర అస్వ స్థత కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అంగీకరించారు. తాము అన్ని రకాల ఉగ్ర వాద సంస్థలు, మిలిటెంటు సంస్థలపైనా చర్య తీసుకుంటామని ఆ దేశ సమాచార మంత్రి ఫవాద్ చౌధ్రి చెప్పారు. వేర్వేరు నిషేధిత సంస్థలకు చెందిన 44మందిని నిర్బంధించామని ఆంతరంగిక శాఖ సహాయమంత్రి అఫ్రిది చెబుతున్నారు. తీరా బుధవారం సైన్యం అధికార ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ మొత్తం గాలి తీసేశారు. అసలు తమ దేశంలో జైషే సంస్థే లేదని బుకాయించారు. దాన్ని ఐక్యరాజ్యసమితితోపాటు తాము కూడా నిషేధించామని చెప్పుకొచ్చారు. ఈ స్థాయిలో ఉద్రిక్తతలు ఏర్పడిన ప్రస్తుత దశలో కూడా పాక్ వెనకటి గుణాన్ని విడనాడలేదంటే ఏమనుకోవాలి? తమ భూభాగం ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు నిలయం కాకూడదని పాకిస్తాన్ నిజంగా భావిస్తే ఇప్పుడు తీసుకున్నామని చెబుతున్న చర్యలు ఏమాత్రం చాలవు. 44మందినీ ముందస్తు నిర్బంధ చట్టం కింద మాత్రమే అరెస్టు చేశారు. వారంతా కొన్ని రోజుల తర్వాత న్యాయస్థానాలను ఆశ్రయించి విడుదలవుతారు. ఆ తర్వాత ప్రభుత్వం మహా అయితే వారందరినీ నిఘా నీడలో ఉంచుతుంది. లోగడ జైషేను, ముంబై దాడులకు సూత్రధారి అయిన ఉగ్ర సంస్థ లష్కరే తొయిబాను పాకిస్తాన్ నిషేధిస్తే, అది చెల్లదని లాహోర్ హైకోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఆ రెండు సంస్థల అధిపతులు మసూద్ అజర్, హఫీజ్ సయీద్‌లను నిఘా నీడలో ఉంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి 1997లో ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకు ఉగ్రవాద వ్యతిరేక చట్టం(ఏటీఏ) తీసుకొచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఆ చట్టాన్ని అమలు చేయాలి తప్ప ముందస్తు నిర్బంధాల వల్ల, నిఘా వల్ల ప్రయోజనం ఏముంటుంది? అలాంటి నిఘాలో ఉండగానే పుల్వామా దాడికి పథక రచన చేశామని జైషే చెప్పగలిగిందంటే వీటి డొల్లతనం ఏమిటో అర్ధమవుతుంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌తో యుద్ధం అంచుల వరకూ వెళ్లామని, ఇరు దేశాల మధ్యా తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయని గ్రహించి కూడా ఉగ్రవాద సంస్థల సభ్యులపై ఈ అరకొర చర్యలు తీసుకోవడంలోని ఆంతర్యమేమిటో పాకిస్తాన్ చెప్పాలి. ప్రపంచాన్ని తామింకా నమ్మించగలమని అది భావిస్తోందా? పాకిస్తాన్లో ఉగ్రవాద, మిలిటెంటు సంస్థలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద ఒక సంస్థను నిషేధించగానే, దాన్లో పనిచేసే సభ్యులు వెంటనే మరో పేరు తగిలించుకుని రంగంలోకొస్తున్నారు. నిరుడు ఫిబ్రవరిలో అప్పటి పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఒక ఆర్డినెన్స్ ద్వారా జమాత్–ఉద్–దవా, ఫలా–ఏ–ఇన్సానియాత్ ఫౌండేషన్లను నిషేధించారు. కానీ అవి రెండూ అల్ మదినా, ఐసర్ ఫౌండేషన్ అన్న పేర్లతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇలా 69 సంస్థలు పాకిస్తాన్లో ఎలాంటి అడ్డంకులూ ఎదురుకాకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. చిత్రమేమంటే ఇవన్నీ నిషేధ జాబితాలో ఉన్నవే. ఈ సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా సైన్యం, కొందరు పాలకుల చలవతో ఎదిగి విస్తరించినవే. ఇవి మన దేశంలో మాత్రమే కాదు...పాకిస్తాన్లో సైతం విధ్వంసాలకు దిగుతున్నాయి. నెత్తురుటేర్లు పారిస్తున్నాయి. కనుక పాకిస్తాన్ ఇప్పటికైనా చిత్తశుద్ధి ప్రదర్శించి కఠినంగా వ్యవహరించాలి. కంటితుడుపు చర్యల వల్ల ప్రయోజనం ఉండదు. -
పాక్ ఎన్నికలు.. ఫేస్బుక్ సంచలన నిర్ణయం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో త్వరలో జరుగునున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మార్క్ జూకర్బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలపాలను పోత్సహించే సంస్థల ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటన తెలిపారు. జాలై 25 నుంచి పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సహకరించాలని, చట్టబద్ధంగా నమోదు చేయని సంస్థలను రద్దుచేయాలని పాక్ ఎన్నికల కమిషన్ ఇటీవల జూకర్‌బర్గ్‌ను కోరింది. దీనిపై స్పందించిన బర్గ్.. ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు సృష్టించే వివాదాస్పద సంస్థల పేజీలకు, ఫేక్ ఎకౌంట్లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫేస్బుక్ రద్దు చేసిన వాటిలో ముంబై దాడులు సూత్రదారి హఫీజ్ సయ్యద్ స్థాపించిన జమత్-ఉద్-దావా, ఇస్లామిక్ మల్లీ ముస్లిం లీగ్ (ఎమ్‌ఎమ్‌ఎల్) సంస్థలు ఉన్నాయని ఫేస్బుక్ వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఎన్నికలు జరుగనున్న భారత్, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో కూడా ఇదే పద్దతిని అనుసరిస్తామని జూకర్బర్గ్ ప్రకటించారు. సోషల్ మీడియా తీసుకున్న నిర్ణయంపై ఎమ్‌ఎమ్‌ఎల్ ఛీప్ సయ్యద్ మండిపడ్డారు. సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరు తమ ప్రచార అస్తంగా ఉపయోగించుకుంటారని ఎలాంటి సమాచారం లేకుండా తమ ఖాతాలను బ్లాక్ చేయడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ సిద్దాంతాలను, వారి సందేశాలను ప్రజలకు చేరవేయడానికి సోషల్ మీడియా ఎంతో ఉపకరిస్తుందని తమ అభ్యర్థుల పేజీలను రద్దు చేయడం న్యాయం కాదన్నారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఫేస్‌బుక్‌పై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిషత్తులో సోషల్ మీడియాపై ఎలాంటి విమర్శలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జూకర్బర్గ్ తెలిపారు. -
హఫీజ్ సయీద్‌ను వేరే దేశాలకు తరలించండి
-
ఉగ్రనేతలకు బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్ర నేతలు హఫీజ్ సయ్యిద్, సయ్యద్ సలావుద్దీన్‌లకు జాతీయ విచారణ సంస్థ(ఎన్ఐఏ) గట్టి షాక్ ఇచ్చింది. జమ్ము కశ్మీర్ అల్లర్ల సందర్భంగా ఉగ్ర కార్యకలాపాలకు సాయం అందించినందుకు వారి పేర్లను ఛార్జ్‌షీట్‌లో నమోదు చేసింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆర్థిక సాయం వెనుక వేర్పాటు వాద నేతలు, కొందరు వ్యాపార వేత్తల హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ మొదటి నుంచి చెబుతోంది. ఈ క్రమంలో 12 మంది పేర్లతో.. 1,279 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్‌ను ఢిల్లీలోని ఓ న్యాయస్థానానికి అందజేసింది. ఛార్జ్ షీట్లో పేర్కొన్న నిందితులను విచారణ చేపట్టేందుకు అనుమతించాలంటూ కోర్టును ఎన్ఐఏ కోరగా.. కోర్టు నిర్ణయాన్ని తదుపరి విచారణకు వాయిదా వేసింది. ఆరు నెలల విచారణ.. 60 ప్రాంతాల్లో తనిఖీలు, 300 మంది ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి వాంగ్మూలం సేకరణ.. 950 పత్రాల స్వాధీనం.. ఇలా అన్ని కోణాల్లో సాక్ష్యాలను సేకరించాకే ఎన్ఐఏ పక్కాగ ఈ ఛార్జ్ షీట్‌ను రూపొందించింది. లష్కర్-ఇ-తాయిబా చీఫ్ హఫీజ్ సయ్యిద్ పేరును.. హురియత్ కాన్ఫెరెన్స్, హిజ్బుల్ ముజాహిద్దీన్, దుఖ్టరన్-ఇ-మిలత్ సంఘాల అధినేత సయ్యద్ సలావుద్దీన్ పేర్లను ఛార్జ్ షీట్లో పేర్కొంది. వీరిద్దరు ఉగ్రవాదులను భారత్‌పైకి ఉసిగొల్పటంతోపాటు వారికి ఆర్థిక సాయం అందించారని పేర్కొంది. ఇక జమ్ము కశ్మీర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ వాటాలి పేరు కూడా ఛార్జ్‌షీట్‌లో ఉండటం విశేషం. మాజీ మిలిటెంట్ బిట్టా కరాటె, ఫోటో జర్నలిస్ట్ కమ్రాన్ యూసఫ్, జావేద్ అహ్మద్ భట్ పేర్లను కూడా ఎన్ఐఏ ఇందులో పొందుపరిచింది. రెండేళ్ల క్రితం భద్రతా దళాల కాల్పుల్లో బుర్హన్ వనీ మరణించిన తర్వాత కశ్మీర్ లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వారి జ్యూడీషియల్ కస్టడీ గడువు నేటితో ముగిసింది. -
ఉగ్ర సయీద్ ఆస్తులు పాక్ చేతికి!
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఆస్తులు, అతడి అధీనంలోని స్వచ్ఛంద సంస్థలను స్వాధీనం చేసుకోడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. హఫీజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న జమాత్–ఉద్–దవా (జేయూడీ), ఫలాహ్–ఎ–ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐ ఎఫ్)లను అధీనంలోకి తీసుకోవాలని ఐదు ప్రావిన్సులు, లా ఎన్ఫోర్స్ మెంట్ విభాగాలకు ఆర్థిక శాఖ రహస్య ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. సంబంధించిన రహస్య పత్రాలను రాయిటర్స్ సంపాదించింది. 1987లో ఏర్పాటు చేసిన ఈ రెండు సంస్థలు లష్కరే తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థలని, 2008 ముంబై మారణహోమం వెనుక హఫీజ్ హస్తముందని భారత్ ఆరోపిస్తోంది. హఫీజ్ ఆధ్వర్యంలో 300 పాఠశాలలు, ఆస్పత్రులు, ఓ ప్రచురణ సంస్థ, అంబులెన్స్ సర్వీసులు పని చేస్తున్నాయి. అలాగే జేయూడీ, ఎఫ్ఐఎఫ్ సంస్థల్లో 50,000 వరకు వలంటీర్లు, వందల్లో పెయిడ్ వర్కర్లు పని చేస్తున్నారని ఉగ్రవాద నిరోధక సంస్థలు చెబుతున్నాయి. కాగా, హఫీజ్ సంస్థలను స్వాధీనం చేసుకుం టున్నట్లు వస్తున్న వార్తలపై పాక్ మంత్రి ఇక్బాల్ స్పందిస్తూ.. బాధ్యత గల దేశంగా నిషేధిత సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేస్తున్నామని, అమెరికా ఒత్తిడి మేరకు తాము చర్యలు తీసుకోవడం లేదని వెల్లడించారు. విరాళాలపై నిషేధం జేయూడీ, ఎఫ్ఐఎఫ్లకు ఎవరూ విరాళాలు ఇవ్వకుండా పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం నిషేధాజ్ఞలు జారీ చేసింది. జేయూడీ, ఎఫ్ఐఎఫ్లతోపాటు సయీద్‌కు చెందిన మరికొన్ని సంస్థలకు ఎవరూ విరాళాలు ఇవ్వకుండదంటూ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్ఈసీపీ) ఉత్తర్వులు జారీ చేసింది. -
హాఫీజ్ విషయంలో పాక్ తప్పు చేస్తోంది!
వాషింగ్టన్ : ముంబై మారణ హోమం ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ మహ్మద్ సయ్యిద్‌ను గృహ నిర్భందం నుంచి విముక్తి కల్పిస్తూ బుధవారం పాక్ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై అమెరికా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘లష్కర్ ఇ తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ విడుదలైన విషయాన్ని మీడియా ద్వారానే మేం తెలుసుకున్నాం. అంతర్జాతీయ సమాజం దృష్టిలో అతనొక కరడుగట్టిన ఉగ్రవాది. అలాంటి వ్యక్తికి విముక్తి కల్పించి పాక్ తప్పు చేస్తోంది’’ అని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. వందల మంది ప్రాణాలు బలిగొన్న సంస్థ లష్కర్ ఇ తాయిబా అని. దానికి హఫీజ్ కూడా బాధ్యుడే కాబట్టి శిక్షించాలని అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఎల్ఈటీ, దాని అనుబంధ సంస్థలపై ఆంక్షలు విన్న విషయాన్ని అమెరికా ప్రస్తావించింది. కాగా, కోర్టు బయట ఇకపై తాను కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడతానని హఫీజ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. హఫీజ్ తన కపట బుద్ధిని ప్రదర్శించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్ఈటీను 1990లో స్థాపించిన హఫీజ్ సయ్యద్.. భారత్‌సహా పొరుగు దేశాల్లో తన కార్యాకలాపాలను కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో 26/11 ముంబై ఉగ్రదాడుల్లో 166 మందిని పొట్టనబెట్టుకున్నాడు. దీనిపై భారత్ కొన్నేళ్లుగా న్యాయపోరాటం చేస్తుండగా.. పాక్ మాత్రం అతన్ని నిర్దొషిగా పేర్కొంటూ వెనకేసుకుంటూ వస్తోంది. ఐక్యరాజ్య సమితి(భద్రతా మండలి తీర్మానం ప్రకారం), అమెరికా... ఎల్ఈటీ(అనుబంధ సంస్థలతోసహా)పై నిషేధం విధిస్తూ హఫీజ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాయి. చివరకు తీవ్ర ఒత్తిళ్ల నడుమ అతన్ని ఈ ఏడాది జనవరి నుంచి గృహ దిగ్బంధంలో ఉంచింది. అతన్ని విడుదల చేస్తే ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వస్తాయని.. కాబట్టి మూడు నెలలపాటు గృహ నిర్బంధాన్ని పొడిగించాలని పాక్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా.. దానిని తోసిపుచ్చిన పంజాబ్ ప్రొవిన్స్ కోర్టు అతనికి విముక్తి కల్పించింది. -
ఉగ్రవాది పార్టీ పెట్టే యత్నం.. పాక్ ఝలక్
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. కొత్త పార్టీ పెట్టేందుకు చేస్తున్న అతడి ప్రయత్నాలకు గండికొట్టింది. ఎట్టి పరిస్థితుల్లో హపీజ్ సయీద్ పార్టీకి గుర్తింపును ఇవ్వొద్దంటూ పాక్ ఎన్నికల కమిషన్‌ను పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరింది. జమాత్ ఉద్ దవా అధ్యక్షుడు అయిన హఫీజ్‌పై పలు నేరాలు చేసిన కేసులు ఉన్నాయి. ఎన్నో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడని, ముఖ్యంగా భారత్‌లో జరిగే చొరబాట్లకు, సీమాంతర ఉగ్రవాదంలో హఫీజ్ సయీద్ పాత్ర కీలకం అని కూడా తెలిసింది. ఐక్యరాజ్యసమితి కూడా హఫీజ్‌ను ఉగ్రవాదిగా గుర్తించడంతో ఇటీవలె పాకిస్థాన్ అతడిని గృహనిర్భందం చేయడంతోపాటు అతడి అనుచరులను ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాను కొత్త పార్టీ పెడతానంటూ సయీద్ ప్రకటించడంతో ప్రపంచ దేశాల్లో పాకిస్థాన్ పరువు పోయే పరిస్థితి ఏర్పడింది. ఒక ఉగ్రవాది పార్టీ పెడతానంటే పాక్ ఏం చేస్తోందంటూ పలు చోట్ల విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన పార్టీ రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని పాక్ అంతర్గత వ్యవహారాలశాఖ స్పష్టం చేసింది. -
ఆ సూత్రధారిని కూడా సైన్యం టార్గెట్ చేయాలి!
పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి మరీ ఉగ్రవాదులన్ని ఏరివేసేందుకు భారత్ సైన్యం చేసిన ‘సునిశిత దాడుల’ (సర్జికల్ స్ట్రైక్స్)పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. పాకిస్థానీ ఉగ్రవాదులు జరిపిన ఉడీ దాడులో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలు ఈ దాడులపై సంతోషం వ్యక్తం చేశాయి. భారత్‌లో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రచిస్తున్న హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాద సూత్రధారుల్ని మట్టుబెట్టేందుకు కూడా భారత సైన్యం వ్యూహం రచించాలని వారు కోరారు. ఉడీ దాడిలో మరణించిన హవల్దార్ అశోక్‌కుమార్ సింగ్ భార్య సంగీతా దేవీ సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆనందం వ్యక్తం చేశారు. లష్కరే తోయిబా స్థాపకుడు అయిన హఫీజ్ సయీద్‌కు కూడా బుద్ధి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ‘భారత్‌లో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు హఫీజ్ సయీదే సూత్రధారి. భారత సైన్యం అతన్ని లక్ష్యంగా చేసుకొని హతమార్చాలి. అతను లక్ష్యంగా ఇలాంటి దాడులు చేయాలి’ అని సంగీతాదేవి మీడియాతో పేర్కొన్నారు. మరో అమర సైనికుడు ఎస్కే విద్యార్థి భార్య స్పందిస్తూ సైన్యం దాడులపై హర్షం వ్యక్తం చేశారు. ఉడీ దాడులకు ముందే సైన్యం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఉంటే ఇంతమంది సైనికులు ప్రాణాలు పోయి ఉండేవి కావని ఆమె పేర్కొన్నారు.


