హాఫీజ్‌ విషయంలో పాక్‌ తప్పు చేస్తోంది!

America Strongly Condemn Hafeez Release - Sakshi - Sakshi

వాషింగ్టన్‌ : ముంబై మారణ హోమం ప్రధాన సూత్రధారి, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది హఫీజ్‌ మహ్మద్‌ సయ్యిద్‌ను గృహ నిర్భందం నుంచి విముక్తి కల్పిస్తూ బుధవారం పాక్‌ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై అమెరికా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.

‘‘లష్కర్‌ ఇ తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ విడుదలైన విషయాన్ని మీడియా ద్వారానే మేం తెలుసుకున్నాం. అంతర్జాతీయ సమాజం దృష్టిలో అతనొక కరడుగట్టిన ఉగ్రవాది. అలాంటి వ్యక్తికి విముక్తి కల్పించి పాక్‌ తప్పు చేస్తోంది’’ అని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. వందల మంది ప్రాణాలు బలిగొన్న సంస్థ లష్కర్‌ ఇ తాయిబా అని. దానికి హఫీజ్‌ కూడా బాధ్యుడే కాబట్టి శిక్షించాలని అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఎల్‌ఈటీ, దాని అనుబంధ సంస్థలపై ఆంక్షలు విన్న విషయాన్ని అమెరికా ప్రస్తావించింది. 

కాగా, కోర్టు బయట ఇకపై తాను కశ్మీర్‌ స్వాతంత్ర్యం కోసం పోరాడతానని హఫీజ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. హఫీజ్‌ తన కపట బుద్ధిని ప్రదర్శించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్‌ఈటీను 1990లో స్థాపించిన హఫీజ్‌ సయ్యద్‌.. భారత్‌సహా పొరుగు దేశాల్లో తన కార్యాకలాపాలను కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో 26/11 ముంబై ఉగ్రదాడుల్లో 166 మందిని పొట్టనబెట్టుకున్నాడు. దీనిపై భారత్‌ కొన్నేళ్లుగా న్యాయపోరాటం చేస్తుండగా.. పాక్‌ మాత్రం అతన్ని నిర్దొషిగా పేర్కొంటూ వెనకేసుకుంటూ వస్తోంది. ఐక్యరాజ్య సమితి(భద్రతా మండలి తీర్మానం ప్రకారం), అమెరికా... ఎల్‌ఈటీ(అనుబంధ సంస్థలతోసహా)పై నిషేధం విధిస్తూ హఫీజ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాయి. చివరకు తీవ్ర ఒత్తిళ్ల నడుమ అతన్ని ఈ ఏడాది జనవరి నుంచి గృహ దిగ్బంధంలో ఉంచింది. 

అతన్ని విడుదల చేస్తే ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వస్తాయని.. కాబట్టి మూడు నెలలపాటు గృహ నిర్బంధాన్ని పొడిగించాలని పాక్‌ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయగా.. దానిని తోసిపుచ్చిన పంజాబ్‌ ప్రొవిన్స్‌ కోర్టు అతనికి విముక్తి కల్పించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top