breaking news
disables
-
పాక్ ఎన్నికలు.. ఫేస్బుక్ సంచలన నిర్ణయం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో త్వరలో జరుగునున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మార్క్ జూకర్బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలపాలను పోత్సహించే సంస్థల ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటన తెలిపారు. జాలై 25 నుంచి పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సహకరించాలని, చట్టబద్ధంగా నమోదు చేయని సంస్థలను రద్దుచేయాలని పాక్ ఎన్నికల కమిషన్ ఇటీవల జూకర్‌బర్గ్‌ను కోరింది. దీనిపై స్పందించిన బర్గ్.. ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు సృష్టించే వివాదాస్పద సంస్థల పేజీలకు, ఫేక్ ఎకౌంట్లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫేస్బుక్ రద్దు చేసిన వాటిలో ముంబై దాడులు సూత్రదారి హఫీజ్ సయ్యద్ స్థాపించిన జమత్-ఉద్-దావా, ఇస్లామిక్ మల్లీ ముస్లిం లీగ్ (ఎమ్‌ఎమ్‌ఎల్) సంస్థలు ఉన్నాయని ఫేస్బుక్ వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఎన్నికలు జరుగనున్న భారత్, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో కూడా ఇదే పద్దతిని అనుసరిస్తామని జూకర్బర్గ్ ప్రకటించారు. సోషల్ మీడియా తీసుకున్న నిర్ణయంపై ఎమ్‌ఎమ్‌ఎల్ ఛీప్ సయ్యద్ మండిపడ్డారు. సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరు తమ ప్రచార అస్తంగా ఉపయోగించుకుంటారని ఎలాంటి సమాచారం లేకుండా తమ ఖాతాలను బ్లాక్ చేయడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ సిద్దాంతాలను, వారి సందేశాలను ప్రజలకు చేరవేయడానికి సోషల్ మీడియా ఎంతో ఉపకరిస్తుందని తమ అభ్యర్థుల పేజీలను రద్దు చేయడం న్యాయం కాదన్నారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఫేస్‌బుక్‌పై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిషత్తులో సోషల్ మీడియాపై ఎలాంటి విమర్శలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జూకర్బర్గ్ తెలిపారు. -
వరల్డ్ స్పెషల్ ఒలింపిక్స్‌కు బుద్ధిమాంద్యులు
అనంతపురం స్పోర్ట్స్: వరల్డ్ స్పెషల్ ఒలింపిక్స్‌కు ఆర్డీటీ నుంచి 13 మంది బుద్ధిమాంద్యులను పంపుతున్నట్లు ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అన్నే ఫెర్రర్ తెలిపారు. గత ఆరేళ్లుగా స్పెషల్ ఒలింపిక్స్‌లో బుద్ధిమాంద్యులు సాధిస్తున్న విజయాలపై 'బంగారు పండిస్తున్న ఆర్డీటీ స్పెషల్ ఒలింపిక్స్' అనే పుస్తకాన్ని అన్నే ఫెర్రర్ మెయిన్ క్యాంపస్‌లో బుధవారం ఆవిష్కరించారు. అమెరికాలోని లాస్ఏంజిల్స్లో ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు వరల్డ్ స్పెషల్ ఒలింపిక్స్ జరుగుతాయని ఆమె తెలిపారు. 'ప్రతి ఏడాదిలాగే మా సంస్థలో శిక్షణ పొందుతున్న బుద్ధిమాంద్యులకు అవకాశం కల్పిస్తున్నాం. సకలాంగులకు ధీటుగా బుద్ధిమాంద్యులు సాధిస్తున్న విజయాలు అందరికీ స్పూర్తిని నింపుతున్నాయి. వారిని దృష్టిలో ఉంచుకునే పుస్తకాన్ని ఆవిష్కరించాం. పిల్లలతో పాటు ఆరు మంది కోచ్‌లను పంపుతున్నాం. త్వరలో జరిగే స్పెషల్ ఒలింపిక్స్‌లోనూ విజయాలు సాధిస్తారు' అని అన్నే ఫెర్రర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీటీ సీబీఆర్ సెక్టార్ డెరైక్టర్ దశరథ్, డిప్యూటీ డెరైక్టర్ చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు.