
పండ్లతో గుండె భద్రం!
తరచూ పండ్లు తినే వాళ్లకు గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువని తాజా అధ్యయనంలో తేలింది.
బీజింగ్: తరచూ పండ్లు తినే వాళ్లకు గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువని తాజా అధ్యయనంలో తేలింది. చైనాలోని పది పట్టణాలు, గ్రామాల్లో సుమారు ఏడేళ్ల పాటు 5లక్షల మంది వయోజనులపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సెన్సైస్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించా రు. ముఖ్యంగా యాపిల్, నారింజ పండ్లు రక్తపోటు నియంత్రణ తదితరాలపై ప్రభావం చూపుతున్నట్లు వెల్లడైంది. రోజుకు వంద గ్రాముల పండ్లు తినడంవల్ల గుండె సంబంధ వ్యా ధులు వచ్చే అవకాశం చాలా తక్కువని పరిశోధనలో తేల్చారు.