రేస్‌కు వెళ్తుంటే ప్రమాదం .. 18 మంది మృతి | Double decker bus overturned in Hong Kong | Sakshi
Sakshi News home page

రేస్‌కు వెళ్తుంటే ప్రమాదం .. 18 మంది మృతి

Feb 11 2018 11:03 AM | Updated on Feb 11 2018 11:53 AM

Double decker bus overturned in Hong Kong - Sakshi

బోల్తా పడిన డబుల్‌ డెక్కర్‌ బస్సు

హాంగ్‌కాంగ్‌ : హాంగ్‌కాంగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డబుల్‌ డెక్కర్‌ బస్సు బోల్తా పడటంతో 18 మంది మృతి చెందగా, 47 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  అభిమానులు హార్స్‌ రేసులను వీక్షించడానికి వేసిన ప్రత్యేక బస్సు, థాయ్‌ పో నుంచి షాటిన్‌ రేస్‌కోర్స్‌ వెళ్తుండగా ఈప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సు బోల్తా పడిన అనంతరం రోడ్డు పక్కనే ఉన్న బస్సు స్టేషన్‌పైకి దూసుకెళ్లింది. బోల్తా పడిన తర్వాత రెస్క్యూ సిబ్బంది బస్సు టాప్‌ను కట్ చేసి అందులో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తీశారు.

ఈ ఘటనపై కోవ్‌లోన్‌ మోటర్‌ బస్సు కంపెనీ లిమిటెడ్‌ మేనేజర్‌ సో వాయ్‌ కీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపారు. ఒక్కో బాధిత కుటుంబానికి 80,000 హాంగ్‌కాంగ్‌ డాలర్లు(దాదాపు రూ. 6.50 లక్షలు) ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement