మరో ఎయిర్పోర్ట్ సమీపంలో కారుబాంబు పేలుళ్లు | Double Car Bomb Attack Kills 4 Near Aden airport: Military | Sakshi
Sakshi News home page

మరో ఎయిర్పోర్ట్ సమీపంలో కారుబాంబు పేలుళ్లు

Jul 6 2016 10:33 AM | Updated on Sep 4 2017 4:16 AM

మరోసారి విమానాశ్రయం లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈసారి యెమెన్లో వారు పైశాచికత్వం ప్రదర్శించారు. అడెన్ విమానాశ్రయానికి సమీపంలో రెండు కారుబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

అడెన్: మరోసారి విమానాశ్రయం లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈసారి యెమెన్లో వారు పైశాచికత్వం ప్రదర్శించారు. అడెన్ విమానాశ్రయానికి సమీపంలో రెండు కారుబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, అక్కడే ఉన్న మిలటరీ స్థావరం, ఎయిర్ పోర్ట్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

చనిపోయిన వాళ్లంతా మిలటరీ చెందిన వారే. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ప్రపంచ దేశాల్లో కొద్ది రోజులుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ఈ సంస్థ ఈ దాడులు చేస్తున్న నేపథ్యంలో తాజాగా యెమెన్ దాడి కూడా వారి పనే అని అధికారులు అనుమానిస్తున్నారు. ఒక కారు మిలటరీ క్యాంపు బేస్ వద్ద పేల్చగా.. మరో కారును క్యాంపు లోపలికి తీసుకెళ్లాక పేల్చారు.

Advertisement
 
Advertisement
Advertisement