‘నా టేబుల్‌ మీదా.. బటన్‌ ఉంది’ | Donald Trump's new message for Kim Jong Un | Sakshi
Sakshi News home page

‘నా టేబుల్‌ మీదా.. బటన్‌ ఉంది’

Jan 3 2018 9:03 AM | Updated on Jul 29 2019 5:39 PM

Donald Trump's new message for Kim Jong Un - Sakshi

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఉత్తర కొరియా మీద విరుచుకుపడ్డారు. ‘కిమ్‌ నీ టేబుల్‌ మీద ఉండే న్యూక్లియర్‌ బటన్‌ కన్నా పెద్దది, అంతకన్నా చాలా శక్తివంతమైన న్యూక్లియర్‌ బటన్‌ నా టేబుల్‌ మీద ఉంది’ అది గుర్తుంచుకో అంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైన నాటి నుంచి ఇరు దేశాల మధ్య మాటలయుద్ధం పతాక స్థాయికి చేరింది. అదే సమయంలో ఉత్తర కొరియా వరుస అణ్వస్త్ర పరీక్షలతో ప్రపంచాన్ని కంగారు పెట్టింది. 

ట్రంప్‌ ట్వీట్‌ వెలువడిన కొద్ది గంటల్లోనే.. అత్యంత శక్తివంతమైన ఖండాంతర క్షిపణిని (ఇంటర్‌ కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌) రూపొందించాలని సైంటిస్టులకు కిమ్‌ ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఉత్తర కొరియా గత ఏడాది అణుబాంబులతోపాటు హైడ్రోన్‌ బాంబును కూడా పరీక్షించింది. అమెరికా, దాని మిత్ర దేశాలు తమను భయపెడుతూ సైనిక విన్యాసాలు నిర్వహించినంత కాలం అణు కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని ఉత్తర కొరియా స్పష్టం చేసింది.

ఇదిలావుండగా.. కొత్త ఏడాదిని ఆహ్వానిస్తూ కిమ్‌ జాంగ్‌ ఉన్‌.. అమెరికాను తీవ్ర స్థాయిలో హెచ్చరించిన విషయం తెలిసిందే. తన టేబుల్‌ మీద ఎప్పుడూ ఒక బటన్‌ ఉంటుంది.. దానిని నొక్కితే అమెరికా బుగ్గిపాలే అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement