ఐసిస్‌ కొత్త లీడరే అమెరికా టార్గెట్‌: ట్రంప్‌

Donald Trump says U.S. on the hunt for new ISIS leader - Sakshi

వాషింగ్టన్‌: ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ కొత్త లీడర్‌పైనే అమెరికా దృష్టి సారించిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఎకనామిక్‌ క్లబ్‌ ఆఫ్‌ న్యూయార్క్‌లో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘అందరికీ తెలుసు అతను ఎక్కడున్నాడో..’అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొత్త టార్గెట్‌ పేరుని మాత్రం ట్రంప్‌ వెల్లడించలేదు. ఉగ్రసంస్థ చీఫ్‌ అబూ బాకర్‌ అల్‌ బాగ్దాదీని గత నెలలో అమెరికా కమాండోలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఆత్మాహుతి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అతని స్థానంలోకి వచ్చిన అబూ ఇబ్రహీం అల్‌ హష్మీ అల్‌ ఖురేషీనే అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘అమెరికా అల్‌ బాగ్దాదీని అంతం చేసింది. అతని తర్వాతి వ్యక్తి (నంబర్‌–2)ని కూడా మట్టుబెట్టింది. ఇప్పుడు మిగిలిన నంబర్‌–3పైనే మా దృష్టంతా.. అతనికి చాలా సమస్యలున్నాయి. ఎందుకంటే అతను ఎక్కడున్నాడో మాకు తెలుసు కాబట్టి..’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top