‘ట్రంప్‌ను ఉరితీసినా తప్పు లేదు’ | Donald Trump a hideous criminal, deserves death penalty | Sakshi
Sakshi News home page

‘ట్రంప్‌ను ఉరితీసినా తప్పు లేదు’

Nov 15 2017 3:35 PM | Updated on Aug 25 2018 7:52 PM

Donald Trump a hideous criminal, deserves death penalty - Sakshi

సియోల్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఉత్తర కొరియా మరొసారి తీవ్రంగా మండిపడింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌పై అవమానకర వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ను ఉరితీసినా తప్పులేదని ఉత్తర కొరియా పేర్కొంది. ట్రంప్‌ దక్షిణ కొరియా పర్యటనపైనా ఉత్తర కొరియా ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. కిమ్‌ను అత్యంతకౄర నియంతగా ట్రంప్‌ పేర్కొనడానికి ఉత్తర కొరియా ఖండించింది.

ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలకు వ్యతిరేకంగా పలు దేశాల దేశాల మద్దతు కూడగట్టే క్రమంలో ట్రంప్‌ ఆసియాలో పర్యటించిన విషయం విదితమే. డొనాల్డ్‌ ట్రంప్‌ది ప్రపంచంలోనే అత్యంత కౄర మనస్థత్వమని ఉత్తర కొరియా ప్రకటించింది. అతన్ని ఉరితీసినా తప్పు లేదని ఆ దేశం పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement