ట్రంప్ మరో సంచలన నిర్ణయం | Donald Trump decides not to be in paris climate deal | Sakshi
Sakshi News home page

ట్రంప్ మరో సంచలన నిర్ణయం

May 31 2017 6:21 PM | Updated on Aug 25 2018 7:52 PM

ట్రంప్ మరో సంచలన నిర్ణయం - Sakshi

ట్రంప్ మరో సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని యాక్సియాస్ న్యూస్ సంస్థ తెలిపింది. అత్యంత విశ్వసనీయమైన వర్గాల ద్వారా ఈ విషయం తెలిసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల్లో 56 శాతం విడుదల చేస్తున్న దాదాపు 70 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయ.

అయితే ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసేందుకు ట్రంప్ నిరాకరించారు. ఇంతకుముందు దీనిపై నిర్ణయం తీసుకోడానికి తనకు మరింత సమయం అవసరమని ఆయన చెప్పారు. ఈ వారంలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కూడా గతంలో చేసిన ట్వీట్‌లో తెలిపారు. ఇప్పుడు కుండ బద్దలుకొట్టేశారు. ప్రపంచంలోని ముఖ్యమైన దేశాల్లో ఈ ఒప్పందం మీద సంతకం చేయని ఏకైక దేశం అమెరికా కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement