ఫొటో కోసం.. ఆత్మహత్య

DIED FOR PHOTO

ఆశ్చర్యపోయిన టూరిస్టులు

లండన్‌ : పిచ్చి పతాక స్థాయి.. ఇంతకు మించి అనడానికి.. ప్రపంచ భాషల్లో పదాలు కూడా ఉండవు. సెల్ఫీలు వచ్చాక.. యువత వాటికి బానిసలుగా మారారు. అందులో సందేహం లేదు. సెల్ఫీల మోజులో ఎందరో ప్రాణాలు కోల్పోయారు.. కోల్పోతున్నారు. తాజాగా ఒక్క ఫొటో కోసం​ కొరియా యువతి ఆత్మహత్య చేసుకుంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ఇంగ్లాండ్‌లో జరిగింది.

ఇంగ్లాండ్‌లోని ఈస్ట్‌ససెక్స్‌ ప్రాంతాన్ని స్వర్గంగా పర్యాటకులు భావిస్తుంటారు. ఎత్తయిన మైదాన ప్రాంతాలు.. హోరెత్తె అలలో సాగే ఇంగ్లీష్‌ ఛానెల్‌ సముద్రం.. దూరం నుంచి మంచు పర్వతాలు.. ఇలా ఉంటుంది ఈ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అందరిలాగే దక్షిణ కొరియా నుంచి హేవోన్‌ కిమ్‌ (23) అనే యువతి వచ్చింది. ఎత్తయిన మైదాన ప్రాంతం.. తల వంచి చూస్తే.. సముద్రం.. అలలు కనిపిస్తాయి. ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసిన ఆమెకు 200 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకితే.. అన్న ఆలోచన వచ్చింది. అదే తడవుగా.. అక్కడ ఉన్న ఒక వ్యక్తి చేతికి తన మొబైల్‌ ఇచ్చి ఫొటోలు తీయమని కోరింది. అతడు మొబైల్‌తో ఫొటోలు తీస్తుండగా.. అడుగులు వెనక్కి వేసుకుంటి.. నా కిందకు దూకుతున్నా.. ఫొటోలు తీయండి.. అని గట్టిగా చెప్పింది.. అతడు దగ్గరకువచ్చే  లోపు.. కిందకు దూకేసింది.  

ఆమెను రక్షించేందుకు తీరప్రాంత నౌకాదళ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. 200 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో.. కిమ్‌ నీళ్లలో పడేలోపు మరణించింది. కిమ్‌ కిందకు దూకే సయంలో అక్కడే ఉన్న ప్రత్యక్షసాక్షి మాట్లాడుతూ.. ఆమె ఫొటోల కోసం కిందకు దూకుతున్నా అనే మాట అన్నదని చైనాకు చెందిన టూరిస్ట్‌ జియాంగ్‌ జాంగ్‌ అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top