వారికి గుడ్‌న్యూస్‌: అమెరికా మరో భారీ ప్యాకేజీ!

Democrats Pass 3 Trillion Dollar Covid 19 Relief Bill In House - Sakshi

3 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి ప్రతినిధుల సభ ఆమోదం

వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా సంక్షోభం నుంచి అమెరికాను గట్టెక్కించేందుకు ట్రంప్‌ సర్కారు ఇప్పటికే పలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా.. తాజాగా 3 ట్రిలియన్‌ డాలర్లతో కూడిన భారీ ప్యాకేజీ విడుదలకు రంగం సిద్ధం అయ్యింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం సహా దేశ పౌరుల ఆరోగ్య అవసరాలు ప్రాధాన్యాంశాలుగా డెమొక్రాట్లు ఈ మేరకు బిల్లును ప్రతిపాదించారు.

కాగా వివిధ రాష్ట్రాలు నిధులు సమకూర్చుకునేందుకు, కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, నిరుద్యోగులు, అద్దెదార్లు, ఇళ్ల యజమానులు, బకాయిలు చెల్లించలేని విద్యార్థులు ఈ ప్యాకేజీ ద్వారా ఉపశమనం పొందనున్నట్లు తెలుస్తోంది. 3 ట్రిలియన్‌ డాలర్లలో 1 ట్రిలియన్‌ డాలర్లు రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు... కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అమెరికన్‌ కుటుంబాలను ఆదుకోవడానికి నగదు పంపిణీ, చిన్న వ్యాపారస్తులకు బిల్లు ద్వారా లబ్ది చేకూర్చేలా బిల్లు రూపొందింది. (ట్రంప్‌ : డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల కోత?)

ఇక ప్రతినిధుల సభలో మెజారిటీ డెమొక్రాట్లదే కావడంతో 208-199 ఓటింగ్‌ తేడాతో బిల్లును నెగ్గించుకున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ రిపబ్లికన్‌తో పాటు 14 మంది డెమొక్రాట్లు కూడా ఈ బిల్లును వ్యతిరేకించడం గమనార్హం. ఇక ఈ బిల్లుపై ఓటింగ్‌ సందర్భంగా స్పీకర్‌ నాన్సీ పెలోసి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మానవతా దృక్పథంతో ఇప్పుడు కూడా మనం సరైన రీతిలో స్పందించకపోతే.. బాధ్యతారాహిత్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అమెరికన్ల జీవితాల్లో.. అమెరికా రాష్ట్రాలు, ప్రాంతాల బడ్జెట్‌లో ఇదే పెద్ద పెట్టుబడి అని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ వల్ల అతలాకుతలమైన ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచి, సమస్యలను అధిగమించేలా చేయాలనుకుంటున్నామని వ్యాఖ్యానించారు.   

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రిపబ్లికన్లు ఈ బిల్లును సెనేట్‌లో అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఎద్దేవా చేసిన రిపబ్లికన్లు.. వైట్‌హౌజ్‌లో వీటో(తిరస్కారం)కు గురవుతుందంటూ బెదిరింపు ధోరణి అవలంబించడం ఇందుకు నిదర్శనం. ఇక కరోనా సహాయక చర్యల్లో భాగంగా నాలుగోదశ ప్రారంభమైందని ట్రంప్‌ వైట్‌హౌజ్‌లో విలేకరులకు తెలిపారు. ఇందుకు సంబంధించిన చట్టంపై ఆయన సంతకం చేశారు. కాగా సహాయక చర్యల్లో భాగంగా మార్చిలో 2.2 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీ, చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు 483 బిలియణ్‌ డాలర్ల ప్యాకేజీని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అమెరికా పన్ను చెల్లింపుదారులను ఆదుకునేందుకు పేరోల్‌ టాక్సులను తగ్గించాలని ట్రంప్‌ గత కొద్ది కాలంగా డిమాండ్‌ చేస్తున్న విషయం విదితమే.  (కరోనా సంక్షోభం: 484 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీ)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

29-11-2020
Nov 29, 2020, 17:31 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేయించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు...
29-11-2020
Nov 29, 2020, 09:46 IST
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 75 మందికి కరోనా పాజిటివ్‌ రావడం...
29-11-2020
Nov 29, 2020, 04:37 IST
సాక్షి, హైదరాబాద్, మేడ్చల్‌: దేశంలో కరోనా టీకా అభివృద్ధి కోసం మూడు ఫార్మా దిగ్గజ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను ప్రత్యక్షంగా...
28-11-2020
Nov 28, 2020, 20:28 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రపదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 49,348 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 625...
28-11-2020
Nov 28, 2020, 20:25 IST
సాక్షి, అమరావతి: ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అని సామెత. ప్రపంచం మొత్తమ్మీద ఉన్న గణిత శాస్త్రవేత్తలకు ఇప్పుడీ సామెత...
28-11-2020
Nov 28, 2020, 18:55 IST
కంపెనీలు ప్రకటిస్తున్న ఏ కరోనా వ్యాక్సిన్లను తీసుకోమంటూ కొంత మంది దేశాధినేతలే ప్రకటించడం ఆశ్చర్యకరంగా ఉంది.
28-11-2020
Nov 28, 2020, 17:03 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ని కట్టడి చేయగల వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే....
28-11-2020
Nov 28, 2020, 16:42 IST
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చిన నాలుగు వారాల్లోనే ఢిల్లీ వాసులందరికి అందజేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్...
28-11-2020
Nov 28, 2020, 16:06 IST
భోపాల్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన నాటి నుంచి ప్రజల్లో ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మీద విపరీతమైన శ్రద్ధ పెరిగింది....
28-11-2020
Nov 28, 2020, 15:38 IST
వ్యాక్సిన్ల పనితీరును అంచనా వేయడానికి ఓ చిత్రమైన మేథమెటికల్‌ ఫార్ములాను అమలు చేస్తున్నారు.
28-11-2020
Nov 28, 2020, 15:30 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  భారత్‌ బయోటెక్‌ పర్యటన ముగిసింది. మూడు నగరాల పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చని...
28-11-2020
Nov 28, 2020, 15:28 IST
సిమ్లా: కరోనా వ్యాప్తి కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమాలు తెచ్చినా.. కొందరు జనాలు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోరు....
28-11-2020
Nov 28, 2020, 11:13 IST
మహారాష్ట్ర: కరోనా బారిన పడి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భారత్‌ భాల్కే మరణించారు. పుణేలోని రబీ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి...
28-11-2020
Nov 28, 2020, 08:23 IST
బీజింగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ గురించి మరో కొత్త విషయం బయటపడింది. శరీరం మొత్తం వ్యాపించేందుకు కరోనా వైరస్‌ మన...
28-11-2020
Nov 28, 2020, 04:53 IST
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) కరోనా వ్యాధి నిర్ధారణకు అభివృద్ధి...
28-11-2020
Nov 28, 2020, 04:26 IST
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్రానికి ఆదేశాలు...
28-11-2020
Nov 28, 2020, 03:27 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ముందు చూపుతో వ్యవహరించి వైరస్‌...
27-11-2020
Nov 27, 2020, 17:34 IST
న్యూఢిల్లీ: భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య వ్యాక్సిన్‌ డీల్‌ కుదిరింది. పొరుగు దేశానికి మూడు కోట్ల వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేసేందుకు...
27-11-2020
Nov 27, 2020, 13:50 IST
మాస్కో/ హైదరాబాద్‌: దేశీయంగా రష్యన్‌ వ్యాక్సిన్‌ తయారీకి హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ హెటెరో డ్రగ్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రష్యన్‌ డైరెక్ట్‌...
27-11-2020
Nov 27, 2020, 11:47 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసులు 93లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 43,082 కోవిడ్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top