అమెరికా అధ్యక్ష బరిలో ఉన్నరిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డ్రొనాల్డ్ ట్రంప్ ను ప్రముఖ ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామా అనుకరించి ఆకట్టుకున్నారు.
టిబెట్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డ్రొనాల్డ్ ట్రంప్ను ప్రముఖ ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామా అనుకరించి ఆకట్టుకున్నారు. 'బ్రిటన్ గుడ్ మార్నింగ్' పత్రిక జర్నలిస్టు పీర్స్ మోర్గాన్ శుక్రవారం దలైలామాను ఇంటర్వూ చేసిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు మీరు ఎవరిరైనా వివాదాస్పద వ్యక్తిని కలుసుకున్నారా? అయితే ఆ వ్యక్తి ఎవరని మోర్గాన్ ప్రశ్నించారు.
దీనికి దలైలామా నవ్వుతూ... నేను ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని కలుసుకోలేదని చెబుతూనే.. ట్రంప్ తన జుట్టు దువ్వుకోవడాన్ని, మాట్లాడే విధానాన్ని ఆయన అనుకరించారు. ట్రంప్ మిమ్మల్ని అధ్యక్ష భవనానికి ఆహ్వానిస్తే అతన్నికోరేదేమిటి అన్న మరో ప్రశ్నకు దలైలామా స్పందిస్తూ... 'దయ చూపించు' అని సమాధానం చెప్పారు. దీనిని మోర్గాన్ ట్వీటర్లో పోస్ట్ చేయగానే 320 రీట్వీట్లు, 400 లైక్లు వచ్చాయి.