కరోనా: వివాదం రేపిన ట్రంప్‌ ట్వీట్‌

Covid 19 China Angry Over Donald Trump Calling Chinese Virus - Sakshi

వాషింగ్టన్‌/బీజింగ్‌: చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్ర బిందువుగా పుట్టుకొచ్చిన మహమ్మారి కోవిడ్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా దెబ్బకు కుదేలైంది. అక్కడ మూడు వేలకు పైగా జనం వైరస్‌ బారిన పడగా.. 62 మంది మరణించారు. వైరస్‌ దాడితో దేశ ఆర్థిక రంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఓ ట్వీట్‌పై వివాదాస్పదమైంది. కోవిడ్‌-19ను చైనీస్ వైర‌స్ అని ట్రంప్‌ పేర్కొనడంపట్ల చైనా అభ్యంతరం తెలిపింది.

చైనీస్ వైర‌స్ వ‌ల్ల అమెరికా పరిశ్ర‌మ‌లు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయంటూ ట్విటర్‌ వేదికగా ట్రంప్‌ ఘాటుగా స్పందించారు. క‌రోనా వ‌ల్ల నష్టపోయిన ఎయిర్‌లైన్స్‌తో ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు మద్దతుగా నిలుస్తామని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో చైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. చైనా సీనియ‌ర్ దౌత్య‌వేత్త యంగ్ జేచీ .. ట్రంప్‌ వ్యాఖ్యలను త‌ప్పుప‌ట్టారు. కోవిడ్‌19 నియంత్ర‌ణ‌కు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, కానీ ట్రంప్ కామెంట్లు స‌రైన రీతిలో లేవ‌ని విమర్శించారు.

తమ దేశాన్ని వేలెత్తి చూపడం మానేసి.. వైరస్‌ నియంత్రణకు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని హితవు పలికారు.కాగా, ట్రంప్ వ్యాఖ్యలను స‌మ‌ర్థిస్తుండగా.. మరికొందరు చైనీస్ వైర‌స్ అన‌డం జాత్యాంహ‌కార‌మే అవుతుంద‌ని విమ‌ర్శించారు. ఇదిలాఉండగా.. క‌రోనా గురించి మాట్లాడిన‌ప్పుడు చాలా స్ప‌ష్ట‌మైన భాష‌ను వాడాల‌ని ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. వైర‌స్ పేరుతో ఎవ‌రినీ దూషించొద్దని తెలిపింది. ఇక చైనాలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top