పాపం పెళ్లి కోసం ఆ జంట 400 మైళ్లు వెళ్లినా.. | Couple have dream £15,000 wedding cancelled 30 MINUTES before ceremony after bungling council loses paperwork | Sakshi
Sakshi News home page

పాపం పెళ్లి కోసం ఆ జంట 400 మైళ్లు వెళ్లినా..

Jul 2 2016 10:43 AM | Updated on Jul 10 2019 7:55 PM

పాపం పెళ్లి కోసం ఆ జంట 400 మైళ్లు వెళ్లినా.. - Sakshi

పాపం పెళ్లి కోసం ఆ జంట 400 మైళ్లు వెళ్లినా..

పెళ్లి చేసుకుందామని 400 మైళ్లు వెళ్లినా తమ వెంట వచ్చిన లాయరే ఓ శనిలా దాపురిస్తే..

లండన్: ఎంతోకాలంగా ప్రేమించుకుంటున్న జంటకు పెళ్లితో ఏకమయ్యే రోజు వస్తే ఆ ఆనందానికి అవధులు ఉంటాయా.. మనసు నచ్చినవాడే భర్తగా.. నచ్చిన అమ్మాయి భార్యగా వస్తే ఆ ఇద్దరి సంతోషానికి పట్టపగ్గాలు ఉంటాయా.. బ్రిటన్లో జాన్ కానింగ్, క్రిస్టీ స్లోన్ అనే ఓ జంటకు ఈ అవకాశం కలిసొచ్చింది. దాంతో ఎంతో సంబురంగా జరుపుకోవాలని ముందుగానే ప్లాన్ చేసుకున్న తమ వివాహానికి ఓ లాయర్ శని రూపంలో దాపరించాడు. మరికొద్ది నిమిషాల్లో పెళ్లి అనగా అందుకు అవసరమైన దస్తావేజులు ఎక్కడో మిస్సయ్యాయంటూ తాఫీగా సెలవిచ్చాడు. దాంతో ఆ జంట ఆశ ఆవిరైపోయింది.

దస్తావేజులు లేకుండా పెళ్లి ఆమోదం పొందదని చెప్పడంతో.. దాదాపు పది లక్షలు ఖర్చు చేసి చేసుకున్న ఏర్పాట్లు వృధా కాగా.. వివాహానికి వచ్చిన 60మంది ఆత్మీయులు నిరాశతో వెనుతిరిగారు. అంతేకాదు.. ఈ పెళ్లి కోసం పాపం వారు దాదాపు 400మైళ్లు పలు స్వీట్ మెమోరీస్ తో ప్రయాణించారు. బంధువులు సంగతి ఎలా ఉన్నా.. ఆ ప్రేమ పక్షుల పరిస్థితి మాత్రం వర్ణనాతీతం. పెళ్లి కూతురు కుమారుడైతే లాయర్ వైపు దీనంగా మొహం పెట్టి ఎందుకిలా చేశావ్ అన్నట్లు దీనంగా చూశారు. తిరిగి తమను తాము తమాయించుకొని దస్తావేజులు రెడీ అయ్యాకే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకొని పెళ్లి రద్దు చేసుకున్నారు. ఇంతకీ ఆ ప్రేమికుల వయసెంతో తెలుసా.. ఆయనకు 42, ఆమెకు 42.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement