చీప్ టు కాస్ట్‌లీ.. | Costly to cheap .. | Sakshi
Sakshi News home page

చీప్ టు కాస్ట్‌లీ..

Nov 18 2014 5:12 AM | Updated on Sep 2 2017 4:38 PM

చీప్ టు కాస్ట్‌లీ..

చీప్ టు కాస్ట్‌లీ..

చిత్రం లోని సోనిక్ డికాంటర్ అనే పరికరం మన వద్ద ఉంటే.. కేవలం 20 నిమిషాల్లో చీప్ వైన్‌కు కూడా కాస్ట్‌లీ టేస్ట్ తెప్పించేయొచ్చట.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు.. వైన్ ఎంత పాతదైతే.. అంత టేస్ట్ అని చెబుతారు. మరి రేటూ అలాగే ఉంటుంది. అయితే, చిత్రం లోని సోనిక్ డికాంటర్ అనే పరికరం మన వద్ద ఉంటే.. కేవలం 20 నిమిషాల్లో  చీప్ వైన్‌కు కూడా కాస్ట్‌లీ టేస్ట్ తెప్పించేయొచ్చట. ఇది దాని ఫ్లేవర్‌ను మార్చి.. స్మూత్‌గా ఉండేలా చేస్తుందట. దీన్ని స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా కూడా నియంత్రించవచ్చు. ముందుగా ఇందులో రెండు కప్పుల నీరు పోయాల్సి ఉంటుంది.

తర్వాత మూత తీసిన వైన్ బాటిల్‌ను ఉంచాలి. బటన్ నొక్కితే.. 20 నిమిషాల్లో మంచి రుచి గల వైన్ రెడీ. ఈ పరికరం అల్ట్రాసౌండ్ టెక్నాలజీ ద్వారా వైన్‌లోని అణు, రసాయన నిర్మాణాన్ని పాత వైన్‌లకు తగ్గట్లు మార్చేస్తుందట. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ పరికరం ‘కిక్‌స్టార్టర్’ సైట్ ద్వారా లభిస్తుంది. ధర రూ.8 వేలు.
 

Advertisement
 
Advertisement
Advertisement