ఈ వాక్‌మ్యాన్‌ రేటుకు కారు కొనుక్కోవచ్చు! | Sony Ultra-Luxury Walkman Costs More Than Hatchback Car Price | Sakshi
Sakshi News home page

వామ్మో ఇదేమి వాక్‌మ్యాన్‌.. దీని రేటుకు కారు కొనుక్కోవచ్చు!

Oct 18 2026 10:54 AM | Updated on Oct 18 2026 11:28 AM

Sony Ultra-Luxury Walkman Costs More Than Hatchback Car Price

కొన్నేళ్ల క్రితం వరకూ వాక్‌మ్యాన్‌లకు పిచ్చ క్రేజ్‌ ఉండేది. స్మార్ట్‌ ఫోన్లు ఇంకా రాకముందు పాటలు, మ్యూజిక్‌ వినేందుకు వాక్‌మ్యాన్‌లను ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ సోనీ ఆ క్రేజ్‌ను తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

సోనీ తన వాక్‌మ్యాన్‌ బ్రాండ్‌లో అత్యంత ఖరీదైన ప్రీమియం మ్యూజిక్‌ ప్లేయర్‌ను ఆవిష్కరించింది. NW-WM1ZM3 పేరుతో రూపొందించిన ఈ పరికరాన్ని నవంబర్‌ 27న జపాన్‌ మార్కెట్లో విడుదల చేయనుంది. దీని ధర 6.55 లక్షల యెన్లు (సుమారు రూ.4.2 లక్షలు). అమెరికాలో ప్రీ-ఆర్డర్‌ ధర 5,900 డాలర్లుగా పేర్కొంది. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా రూ.5.6 లక్షలు. ఈ రేటుకు ఓ చిన్నపాటి కారు కొనుక్కోవచ్చు.

అత్యుత్తమ సంగీత అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ వాక్‌మ్యాన్‌ను రూపొందించారు. డిజిటల్‌ ఆడియోను అసలు రికార్డింగ్‌కు దగ్గరగా ఉండేలా ప్రాసెస్‌ చేసే సాంకేతికత ఇందులో ఉంది. మెరుగైన విద్యుత్‌ సరఫరా కోసం డ్యూయల్‌ కెపాసిటర్లు, అధిక వాహకత కోసం బంగారు పూతతో కూడిన రాగి చాసిస్‌ను ఉపయోగించారు. సౌండ్‌ను కంట్రోల్‌ చేసే స్క్రూలకు సైతం బంగారు పూత పూశారు.

సోనీ మరో రెండు ప్రీమియం మోడళ్లను కూడా అందుబాటులోకి తెస్తోంది. NW-WM1AM3 ధర అమెరికాలో 2,999.99 డాలర్లు (సుమారు రూ.2.85 లక్షలు) కాగా, NW-ZX900 ధర 1,899.99 డాలర్లు (సుమారు రూ.1.8 లక్షలు). ఈ మూడు మోడళ్లలోనూ హైఎండ్‌ కింబర్‌ కేబుల్‌ వైరింగ్‌, ఎస్‌-మాస్టర్‌ హెచ్‌ఎక్స్‌ డిజిటల్‌ యాంప్లిఫైయర్‌ టెక్నాలజీ, డీఎస్‌డీ రీమాస్టరింగ్‌ సదుపాయాలు ఉన్నాయి.

బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే, మోడల్‌ను బట్టి 128 కేబీపీఎస్‌ ఎమ్‌పీ3 ప్లేబ్యాక్‌ 35 నుంచి 40 గంటల వరకు, స్ట్రీమింగ్‌ 31 నుంచి 35 గంటల వరకు కొనసాగుతుందని సోనీ వెల్లడించింది. సంగీత ప్రియుల కోసం రూపొందించిన ఈ వాక్‌మ్యాన్‌ల ధరలు సాధారణ పోర్టబుల్‌ మ్యూజిక్‌ ప్లేయర్లతో పోలిస్తే భారీగా ఉండటం విశేషం.

ఇదీ చదవండి: రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement