కొత్త ఆరంభాలకు స్వాగతం | Samantha Ruth Prabhu has announced a new collaboration with Sony LIV Tamil | Sakshi
Sakshi News home page

కొత్త ఆరంభాలకు స్వాగతం

Jul 5 2026 3:47 AM | Updated on Jul 5 2026 3:47 AM

Samantha Ruth Prabhu has announced a new collaboration with Sony LIV Tamil

హీరోయిన్‌ సమంత ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి.. ఆమె లీడ్‌ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్‌ 19న విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. రెండోది... తాను తల్లి కానున్నట్లు ప్రకటించారామె. ఈ నేపథ్యంలో తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి సై అన్నారు సమంత. సోనీ లివ్‌ తమిళంలో తెరకెక్కించనున్న ఓ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారామె.

‘‘ఒకవైపు సినిమాలు, మరోవైపు వ్యా పారాలు, నిర్మాణ రంగంలో సమంత విజయవంతంగా దూసుకెళుతున్నారు. కొత్తగా ఆలోచించడం, పాత్‌ బ్రేకింగ్‌ నిర్ణయాలు తీసుకోవడం ఆమెకు అలవాటే. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్‌తో సమంత కొత్త హిస్టరీ సృష్టించబోతున్నారు’’ అని సోనీ లివ్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఈ కొత్త ప్రాజెక్ట్‌ గురించి సమంత తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ– ‘‘మార్పును స్వీకరించడం, ప్రయాణాన్ని నమ్మడం, కొత్త ఆరంభాలకు స్వాగతం పలకడం వంటి విషయాలను ఈ ఏడాది నాకు గుర్తు చేసింది. సోనీ లివ్‌ తమిళ్‌తో కలిసి ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. మేం ఆసక్తికరమైన ఒక విషయంపై వర్క్‌ చేస్తున్నాం. ఆ విషయం గురించి త్వరలో అందరితో పంచుకుంటాను’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement