క‌రోనా: వ‌చ్చేవారం చైనాకు డ‌బ్ల్యూహెచ్ఓ బృందం 

Corona: World Health Organization Visits China On Next Week - Sakshi

న్యూఢిల్లీ : వ‌చ్చేవారం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ బృందం చైనాలో ప‌ర్య‌టించ‌నుంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి మూలాన్ని ప‌రిశోధించ‌డానికి త‌మ బృందం చైనాకు వెళ్ల‌నుంద‌ని చీఫ్‌ టెడ్రోస్ అధ‌నామ్ గేబ్రేయేస‌స్ ప్ర‌క‌టించారు. క‌రోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని చైనాకు డబ్ల్యూహెచ్ఓ  బృందాన్ని పంపి దర్యాప్తు జరపాలన్న అమెరికా విమర్శల్లో భాగంగా డబ్ల్యూహెచ్ఓ  కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంర‌ద్భంగా  టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేస‌స్ మాట్లాడుతూ.. ప్ర‌పంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం పట్ల ప్రపంచ  ఆరోగ్య సంస్థ ఆందోళ‌‌న వ్య‌క్తం చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు. వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందిందో తెలుసుకోవడం చాలా చాలా కీలకమనీ... అది ఎలా మొదలైందో తెలిస్తేనే వైరస్‌తో పోరాడగలమని పేర్కొన్నారు. ఇందుకోసం వచ్చేవారంలో చైనా వెళ్లేలా ఓ బృందాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. (చైనాను కలవరపెడుతోన్న మరో వైరస్‌)

(మహిళలకు అత్యంత ప్రమాదకర దేశంగా భారత్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top