
బీజింగ్ : అనారోగ్యంతో ఉన్న తన తల్లికి వైద్యం చేయించేందుకు ఓ యువకుడు ప్రమాదకరమైన స్టంట్లు చేసి ఆ వీడియోలను అమ్ముకోవటం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతని ప్రాణాలు పోగా.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఏషియన్ ఏజ్ కథనం ప్రకారం... 26 ఏళ్ల యోంగ్ నింగ్ సోషల్ మీడియా హీరో. తన తల్లి వైద్య ఖర్చుల కోసం ఈ ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నాడు. ఎత్తైన భవనాలు, ప్రాంతాల్లో వేలాడుతూ ఫోటోలు, వీడియోలు తీసుకోవటం.. వాటిని నెట్‌లో వైరల్ చేసి డబ్బు సంపాదించటం అతనికి వృత్తిగా మారిపోయింది. ఈ క్రమంలో అతను నిపుణుల పర్యవేక్షణ లేకుండా పైగా రక్షణ చర్యలు కూడా పాటించేవాడు కాదు. ఫేస్ బుక్‌లో అతనికి 3 లక్షలకు పైగా అభిమానులు ఉన్నారు.
ఈ క్రమంలో గత నెల 8వ తేదీన ఓ ఎత్తైన భవనం మీద సాహసం చేస్తున్న క్రమంలో ప్రాణాలు వదిలాడు. గాజు భవనం మీద నుంచి వేలాడుతూ విన్యాసాలు చేసిన అతను.. రెండోసారి అదే పని చేస్తున్న క్రమంలో పట్టుజారి పడిపోయాడు. అతని మరణ వార్తను అతని ప్రియురాలు ధృవీకరించింది.
సరిగ్గా నెల క్రితం ఈ నన్ను, ఈ ప్రపంచాన్ని నువ్వు విడిచి వెళ్లిన క్షణం అంటూ వైబోలో సందేశం ఉంచింది. చైనా ఫస్ట్ రూఫ్‌టాపర్ వీరుడిగా యాంగ్‌నింగ్‌కు మంచి పేరు ఉంది.
తల్లి వైద్యం కోసం సాహసం చేయబోయి..